Monkeypox: కెనడాను వణికిస్తున్న మంకీపాక్స్.. 681 కేసుల నిర్ధారణ.. నిత్యం పదుల సంఖ్యలో..

Monkeypox in Canada: కెనడా దేశాన్ని మంకీపాక్స్ వణికిస్తోంది. ఆ దేశంలో ఇప్పటి వరకు 681 మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయినట్లు పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆఫ్ కెనడా (PHAC) వెల్లడించింది.

Monkeypox: కెనడాను వణికిస్తున్న మంకీపాక్స్..  681 కేసుల నిర్ధారణ.. నిత్యం పదుల సంఖ్యలో..
Monkey Pox
Follow us

|

Updated on: Jul 23, 2022 | 11:22 AM

Monkeypox in Canada: కెనడా దేశాన్ని మంకీపాక్స్ వణికిస్తోంది. ఆ దేశంలో ఇప్పటి వరకు 681 మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయినట్లు పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆఫ్ కెనడా (PHAC) వెల్లడించింది. క్యూబెక్‌ ప్రావిన్స్‌లో అత్యధికంగా 331 కేసులు నమోదయ్యాయి. అంటారియోలో 288, బ్రిటిష్ కొలంబియాలో 48, అల్బెర్టాలో 12, సస్కట్చేవాన్‌లో రెండు కేసులు నిర్ధారణ అయినట్లు జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రాంతీయ, ప్రాదేశిక ప్రజారోగ్య భాగస్వాములతో కలిసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు PHAC తెలిపింది. అక్కడ నెలకొన్న పరిస్థితుల ఆధారంగా రోగనిరోధక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. మంకీపాక్స్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో కెనడా ప్రజలు హడలెత్తిపోతున్నారు.

జూలై 18 నాటి వరకు కెనడాలోని క్యూబెక్‌లో అత్యధికంగా మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. ఆ మేరకు అక్కడ వైరస్ వ్యాప్తి రిస్క్ ఎక్కువగా ఉన్న వారికి 12,553 మోతాదుల వ్యాక్సిన్‌ను అందించారు. క్యూబెక్ ప్రాంతాలలో హై రిస్క్ ఏరియాల్లోని జనాభాకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది.

మంకీపాక్స్ అనేది ఒక వైరల్ వ్యాధి. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి లైంగిక సంబంధం, చర్మ ఇన్ఫెక్షన్, శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. అలాగే ఈ వ్యాధి బారినపడిన ఓ వ్యక్తి వినియోగించిన దుస్తులు, బెడ్, తువ్వాళ్లు, టూత్ బ్రష్‌లు, నార వంటి వస్తువులను మరో వ్యక్తి వాడినా.. మంకీపాక్స్ వ్యాధి వ్యాపిస్తోంది. స్వలింగ సంపర్కుల ద్వారా కూడా మంకీపాక్స్ వైరస్ వ్యాపిస్తుందని అధ్యయనాల్లో నిర్థారణ అయ్యింది.

ఇవి కూడా చదవండి

భారత్‌లో మూడు కేసులు నిర్ధారణ..

కాగా మన దేశంలో ఇప్పటి వరకు మూడు మంకీ పాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మూడు కేసులు కేరళలోనే నమోదయ్యాయి. దీంతో కేరళతో పాటు పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మంకీపాక్స్ కేసులు పెరగకుండా నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నాయి. విదేశీ ప్రయాణీకులకు విమానాశ్రయాలు, ఓడరేవుల్లో హెల్త్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.

దేశంలో ఇప్పటి వరకు మూడు మంకీపాక్స్ కేసులు నమోదుకావడంతో అటు కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విదేశీ ప్రయాణీకులకు కఠిన ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా విమానాశ్రయాలు, ఓడరేవులకు ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీలకు విస్తృతంగా హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..