Honey Benefits: పరగడుపున తేనె ఇలా తీసుకుంటే అమేజింగ్ బెనెఫిట్స్.. కొవ్వు వెన్నలా కరిగిపోతుంది అంతే..

ఖాళీ కడుపుతో తేనె తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో తేనె తీసుకుంటే

Honey Benefits: పరగడుపున తేనె ఇలా తీసుకుంటే అమేజింగ్ బెనెఫిట్స్.. కొవ్వు వెన్నలా కరిగిపోతుంది అంతే..
Honey Benefits
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 23, 2022 | 9:33 AM

Honey Benefits On Empty Stomach: తేనెను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. తేనెలో విటమిన్ సి, విటమిన్ బి6, కార్బోహైడ్రేట్లు, అమినో యాసిడ్స్ మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. పోషకాహార గుణాలు అనేకం ఉన్నాయి. అందుకే తేనెను ఆయుర్వేద ఔషధాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. అయితే.. ఖాళీ కడుపుతో తేనె తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో తేనె తీసుకుంటే బరువు ఈజీగా తగ్గొచ్చు. అంతేకాకుండా జలుబు, దగ్గు లాంటి సమస్యలు దూరమై.. రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. బరువు తగ్గేందుకు పరగడుపున గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తీసుకుంటే చాలా మంచిది. ఇది రోజంతా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో తేనె తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

పరగడుపున తేనె తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

బరువు తగ్గడానికి మేలు చేస్తుంది: నేటి కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌లు, పలు డైట్లను పాటిస్తున్నారు. అలాంటివారు బరువు తగ్గడానికి ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో తేనెను తాగడం మంచిది. ఇది శరీరంలో నిల్వ ఉండే అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. కావాలంటే నిమ్మకాయ లేదా జీలకర్ర పొడిని దీనిలో వేసుకోవడం ఇంకా మంచిది.

ఇవి కూడా చదవండి

దగ్గు సమస్య దూరం: గొంతు నొప్పిని, దగ్గును వదిలించుకోవడానికి తేనెను తీసుకోవచ్చు. దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కఫాన్ని తొలగించడంలో సహాయపడతాయి. దీని కోసం మీరు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తేనెను తాగడం మంచిది.

గొంతు నొప్పి: సాధారణంగా చాలా మంది గొంతు నొప్పి సమస్యతో తరచుగా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి పరిస్థితిలో గొంతు నొప్పిని నివారించడానికి ఖాళీ కడుపుతో అల్లం నీటిలో ఒక చెంచా తేనెను కలిపి తీసుకోవచ్చు. ఇది మీ గొంతు నొప్పికి చాలా ఉపశమనాన్ని ఇస్తుంది.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..