AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: వ్యాధులు ముసిరే వేళ.. అరటిపండు తినొచ్చా.. అలా చేస్తే ప్రమాదం తప్పదా

వానాకాలం వ్యాధులు ముసిరే కాలం. చిటపట చినుకులు ఆనందాన్ని తీసుకురావడంతో పాటు ఆరోగ్య సమస్యలనూ మోసుకొస్తాయి. పరిసరాలు బురదమయంగా మారడం, వాన నీరు నిలిచిపోవడం వల్ల అనేక జబ్బులు వస్తాయి. ఈ కాలంలో జలుబు, జ్వరం వంటివి...

Health: వ్యాధులు ముసిరే వేళ.. అరటిపండు తినొచ్చా.. అలా చేస్తే ప్రమాదం తప్పదా
Banana
Ganesh Mudavath
|

Updated on: Jul 23, 2022 | 9:09 AM

Share

వానాకాలం వ్యాధులు ముసిరే కాలం. చిటపట చినుకులు ఆనందాన్ని తీసుకురావడంతో పాటు ఆరోగ్య సమస్యలనూ మోసుకొస్తాయి. పరిసరాలు బురదమయంగా మారడం, వాన నీరు నిలిచిపోవడం వల్ల అనేక జబ్బులు వస్తాయి. ఈ కాలంలో జలుబు, జ్వరం వంటివి వేగంగా వ్యాప్తి చెందుతాయి. అందుకే వానాకాలంలో (Raining Season) ఆహారం పరంగానూ, ఆరోగ్యం పరంగానూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. అయితే సీజన్ తో సంబంధం లేకుండా చౌకగా, విరివిగా లభించే పండ్లలో అరటిపండు (Banana) ముందు వరసలో ఉంటుంది. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ఈ పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మనందరికీ తెలిసిందే. అయితే వ్యాధులు ముసిరే కాలంలో అరటిపండు తినడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తు్న్నారు. ఈ సీజన్ లో అరటిని తీసుకుంటే ఆరోగ్య సమస్యలు కలుగుతాయా లేక ప్రయోజనాలు ఉంటాయా అనే విషయంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేసవి ముగిసిపోయి రుతు పవనాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంట్రీ ఇచ్చి నెలన్నర అవుతోంది. భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి.

అందుకే ఈ కాలంలో అరటిపండును నిరభ్యంతరంగా తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటిపండ్లను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. ఇందులో అమైనో ఆమ్లాలు, విటమిన్ బి6, సి విటమిన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే అజీర్తి, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవారు మాత్రం రాత్రి పూట అరటిపండ్లు తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే అరటిపండ్లతో పాటూ కొన్ని ఆహారాలను కలిపి తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. ముఖ్యంగా అరటిపండు తిన్న వెంటనే పాలు తాగకూడదు. అది విషపూరితంగా మారుతుంది. దీనివల్ల కఫదోషం పెరుగుతుంది. వానాకాలంలో శరీరం చాలా మార్పులు చెందుతుంది. రోగనిరోధక శక్తి కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. కాబట్టి అరటిపండు తినడం వల్ల రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. వీటిని పాటించే ముందు వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..