Monsoon Health Tips: వర్షాకాలంలో విజృంభించే మలేరియా, డెంగీ.. ఈ సూపర్‌ఫుడ్స్‌తో సేఫ్..
Malaria And Dengue : దేశమంతటా రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వానలతో తాగునీరు కలుషితం కావడం, దోమలు వృద్ధిచెందడం, వాతావరణంలోని మార్పులు, డెంగీ, మలేరియా వంటి
Malaria And Dengue : దేశమంతటా రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వానలతో తాగునీరు కలుషితం కావడం, దోమలు వృద్ధిచెందడం, వాతావరణంలోని మార్పులు, డెంగీ, మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా దోమలతో మలేరియా విజృంభించే అవకాశముంది. ఈ వ్యాధికి చికిత్సలున్నా ముందు జాగ్రత్తగా కొన్ని నివారణ చర్యలు పాటించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ హోం రెమెడీస్ ప్రత్యేకత ఏంటంటే.. సాధారణ జీవితంలో కూడా వీటిని అలవర్చుకుంటే మలేరియాతో పాటు మరెన్నో వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. మరి మలేరియా నుంచి రక్షణ పొందేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలో ఒకసారి తెలుసుకుందాం రండి.
అల్లం టీతో..
అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడుతాయి. అదేవిధంగా అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇమ్యూనిటీ పవర్ బలంగా ఉంటే మలేరియా వంటి వ్యాధులు దూరమవుతాయి. ఇందుకోసం అల్లం పొడిని తీసుకుని నీళ్లలో కలుపుకొని తాగాలి. ఆయుర్వేదంలో కూడా అల్లం ప్రాముఖ్యత గురించి చెప్పారు.
బొప్పాయి ఆకు, తేనె
మలేరియా లేదా డెంగీ కారణంగా మన శరీరంలో ప్లేట్‌లెట్స్ వేగంగా పడిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మందులే కాకుండా ఇంట్లో దొరికే కొన్ని ఆహార పదార్థాలను బాగా తీసుకోవాలి. ముఖ్యంగా బొప్పాలు ఆకుల్లో ప్లేట్ లెట్స్ కౌంట్‌ను పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందుకోసం బొప్పాయి ఆకులను నీటిలో వేసి మరిగించి అందులో తేనె మిక్స్ చేసి పరగడుపునే తీసుకోవాలి.
మెంతులు
మెంతుల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మెంతి గింజలలో యాంటీ-ప్లాస్మోడియం ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా మలేరియా వైరస్‌ను తొలగించడానికి పనిచేస్తుంది. ఇందుకోసం మెంతి గింజలను రాత్రి నానబెట్టి, ఉదయం కొద్దిగా వేడి చేసిన తర్వాత ఈ నీటిని తాగాలి. కావాలంటే నానబెట్టిన గింజలను పేస్టులా చేసుకుని కూడా తినవచ్చు.
(గమనిక: ఈకథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని TV9 డిజిటల్ ధృవీకరించడం లేదు. సరైన మార్గదర్శకత్వం లేదా చికిత్స కోసం వైద్యులను సంప్రదించడం మంచిది.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..