Viral news: ఇళ్లు తుడిచి, ఆఫీసు ఊడిస్తే నెలకు లక్షల్లో జీతం..ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీ..

అక్కడ పారిశుద్ధ్య కార్మికులకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారట. మాములు జాబ్‌ చేసే వారికంటే..ఇలా శానిటేషన్‌ వర్క్‌ చేసే వాళ్లే ఎక్కువ సంపాదిస్తారట.

Viral news: ఇళ్లు తుడిచి, ఆఫీసు ఊడిస్తే నెలకు లక్షల్లో జీతం..ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీ..
High Salaries
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 22, 2022 | 4:53 PM

పారిశుద్ధ్య కార్మికులు, స్వీపర్, సఫాయివాలా, పని మనిషి..వీళ్లు లేకపోతే మనం ఇంట్లోంచి అడుగు కూడా బయటపెట్టలేని పరిస్థితి ఉంటుంది. వీళ్లు పనిచేయకపోతే, పాచీ, కుళ్లు కంపుతో వీధులు, రోడ్లు డంపింగ్‌ యార్డులుగా మారిపోవాల్సిందే. అలాంటి పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే వేతనాలు మాత్రం అంతంతా మాత్రంగా ఉంటాయి. దాంతో వారు ఎప్పటికప్పుడూ నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తూనే ఉంటారు. పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్‌ చేసి నెలకు కనీసం జీతం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ అక్కడ పారిశుద్ధ్య కార్మికులకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారట. మాములు జాబ్‌ చేసే వారికంటే..ఇలా శానిటేషన్‌ వర్క్‌ చేసే వాళ్లే ఎక్కువ సంపాదిస్తారట. అందేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆస్ట్రేలియాలో పారిశుద్ధ్య కార్మికుల కొరత చాలా ఎక్కువగా ఉంది.. అక్కడ శానిటరీ వర్కర్స్‌ దొరక్క ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోందట. క్లీనింగ్‌ పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. ఈ క్రమంలోనే పలు కంపెనీలు అధిక జీతం ఇచ్చి అయినా సరే పని మనుషులను పెట్టుకుంటున్నారు. గంటల ప్రాతిపదికన భారీ జీతాలను చెల్లిస్తున్నాయట. అందుకే ఆస్ట్రేలియాలో కార్మికులు ప్రతి నెల సగటున 8 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నారట.. సంవత్సరానికి దాదాపుగా కోటి రూపాయల ప్యాకేజీ అందుకుంటున్నారని తెలిసింది. పారిశుద్ధ్య కార్మికుల సమస్య 2021 నుంచే ఆస్ట్రేలియాను వెంటాడుతుందట. ఈ మేరకు సిడ్నీకి చెందిన క్లీనింగ్ కెంపనీ అబ్సొల్యూట్ డొమెస్టిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ జో వెస్ మాట్లాడుతూ వివరించారు. క్లీనింగ్ చేసే వారు దొరక్క గంటకు 45 డాలర్లు ఇస్తూ మనుషులను పెట్టుకోవాల్సి వస్తుందట. అంటే మన కరెన్సీలో 3600 రూపాయలు. ఏడాది క్రితం గంటకు 2700 ఇచ్చేవారట. కానీ ఇప్పుడు 3500 నుంచి 3600 వరకు ఇవ్వాల్సి వస్తోందట. కొన్ని కంపెనీలు అయితే 4700 రూపాయలు చెల్లించేందుకు కూడా వెనకడుగు వేయట్లేదట. ఇదేదో బాగుంది కదా..? ఇది చదివాకా చాలా మందికి అక్కడికే పనిచేస్తే పోలా అనిపిస్తుందంటున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి