African Swine fever: మరో కొత్త అంటువ్యాధి కలకలం.. 300 పందుల్ని చంపేయాలని ఆదేశాలు..

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Jul 22, 2022 | 3:10 PM

వ్యాధి నిర్ధరణ కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఫాంలోని 300 పందులను చంపేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు పశు సంవర్ధకశాఖ అధికారులు తెలిపారు.

African Swine fever: మరో కొత్త అంటువ్యాధి కలకలం.. 300 పందుల్ని చంపేయాలని ఆదేశాలు..
African Swine Fever

African Swine Fever: దేశంలో రకరకాల వైరస్ లు బయటపడుతున్నాయి. మొన్న కరోనా, నిన్న మంకీ ఫాక్స్ నేడు తాజాగా మరో వ్యాధి గుబులు రేపుతోంది. మరోమారు కేర‌ళ‌లోనే ఈ కొత్తరకం వ్యాధి వెలుగులోకి వచ్చింది. కేరళ వాయ‌నాడ్ జిల్లాల్లో ఉన్న రెండు పందుల ఫార్మ్స్‌లో ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్ కేసులు న‌మోదు అయ్యాయి. భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌లో శాంపిల్స్‌ను పరీక్షించగా జిల్లాలోని రెండు పొలాల్లోని పందులకు ఈ వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయింది.

కేరళ వయనాడ్ జిల్లాలోని మనంతవాడి వద్ద రెండు పందుల పెంపక కేంద్రాల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు వెలుగుచూశాయి. ఒకే ఫాంలో ఎక్కువ పందులు చనిపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు శాంపిళ్లను టెస్టింగ్‌కు పంపించారు. భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌ ఈ శాంపిల్స్‌ను పరీక్షించింది. పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. ఆఫ్రికన్ స్వైన్ వ్యాధి నిర్ధరణ కావడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఫాంలోని 300 పందులను చంపేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు పశు సంవర్ధకశాఖ అధికారులు తెలిపారు. కేరళ కంటే ముందే అసోం, యూపీలలో కూడా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు గుర్తించినట్లు సమాచారం. అయితే అసోంలో పందులను చంపేందుకు పెంపకందారులు ముందుకు రావడం లేదని ఆ రాష్ట్ర పశు సంవర్థకశాఖ మంత్రి తెలిపారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అంటే ఏమిటి? ఇది అంటువ్యాధితో కూడిన వైరల్ వ్యాధి. ఇది అడవి పందులను ప్రభావితం చేస్తుంది. వ్యాధి యొక్క మరణాల రేటు 100 శాతం, మరియు మానవులకు తక్షణ ముప్పు లేనప్పటికీ, ఇది వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రధాన లక్షణాలు ఇలా ఉన్నాయి… ముక్కు, చెవులు, తోక మరియు దిగువ కాళ్ళ యొక్క నీలం-ఊదా సైనోసిస్ కలర్‌లోకి మారుతాయి. కళ్ళు, ముక్కు నుండి విపరీతంగా నీరు కారుతుంటుంది. ఈ వైరస్ అన్ని రకాల వాతావరణాలను తట్టుకోగలదు. బట్టలు, బూట్లు మరియు ఫర్నిచర్ వంటి ఉపరితలాలపై కూడా జీవించగలదు. పంది మాంసంతో తయారు చేయబడిన అన్ని కోల్డ్-ప్రెస్డ్ ఉత్పత్తులు – బేకన్, సాసేజ్‌లు, హామ్ మొదలైనవి వైరస్ బారిన పడతాయి. అయితే ASF మానవులకు ప్రాణాంతకం కాదు. ప్రస్తుతం ASFకి వ్యతిరేకంగా సమర్థవంతమైన వ్యాక్సిన్ లేదు. అయితే తగిన చర్యలు తీసుకోకపోతే చాలా ప్రమాదకరం, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థపై ఇది పెను ప్రభావాన్నే చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా బీహార్, కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసు నమోదైందని కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే కేరళలో అనేక వ్యాధులు వెలుగులోకి వచ్చాయి. ఇటీవలె అక్కడ మంకీపాక్స్ కేసు నమోదైంది. కోవిడ్, స్వైన్ ఫ్లూ, జీకా వైరస్ వంటి వ్యాధులు కేరళలోనే మొదటిసారి వెలుగు చూశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu