కడుపులో క్యాప్యూల్స్‌ రూపంలో హెరాయిన్‌ స్మగ్లింగ్‌.. రూ. 9కోట్ల డ్రగ్స్‌ సీజ్‌ చేసిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు

ఉగాండాలోని ఎంటెబే నుంచి ఈనెల 14న వచ్చిన టాంజానియా జాతీయుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకుని భారీ ఎత్తున హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కడుపులో క్యాప్యూల్స్‌ రూపంలో హెరాయిన్‌ స్మగ్లింగ్‌.. రూ. 9కోట్ల డ్రగ్స్‌ సీజ్‌ చేసిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు
Heroin Capsules
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 21, 2022 | 9:54 PM

చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. దాదాపు 1.26 కిలోల బరువున్న హెరాయిన్ ను సీజ్‌చేశారు ఎయిర్‌పోర్టు అధికారులు..పట్టుబడిన హెరాయిన్‌ విలువ సుమారు రూ. 9కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హెరాయిన్‌ను క్యాప్సూల్స్‌లో నింపి పొట్టలో దాచి రవాణా చేస్తున్న టాంజానియాకు చెందిన ప్రయాణికుడిని అధికారులు అరెస్ట్ చేశారు. ఉగాండాలోని ఎంటెబే నుంచి ఈనెల 14న వచ్చిన టాంజానియా జాతీయుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకుని భారీ ఎత్తున హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఇంత పెద్దగా హెరాయిన్ పట్టుకోవడం జరగలేదు. కిలో మించి బరువున్న ఈ హెరాయిన్ దాదాపు రూ.8.86కోట్ల విలువ ఉంటుందని అధికారులు వివరించారు.

కచ్చిత మైన సమాచారం అందడంతో ఉగాండా లోని ఎంటెబ్బె నుంచి జులై 14న చెన్నై వచ్చిన ఆ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్‌ చేశారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగానికి చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం ET335/692లో ఉగాండాలోని ఎంటెబ్బే నుంచి జూలై 14న నగరానికి వచ్చిన టాంజానియా జాతీయుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని పొట్టలో క్యాప్సూల్స్‌లో నిక్షిప్తం చేసిన హెరాయిన్‌ను గుర్తించిన అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం హెరాయిన్ 1.266 కేజీలు ఉంటుందని.. దాని విలువ రూ. 8.86 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి