Viral Video: స్నేహమంటే ఇదేరా.. హృదయానికి హత్తుకుంటోన్న వీడియో..

మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ స్నేహ భావం ఎక్కువగా ఉంటుంది. జాతివైరం మరిచి కొన్ని జంతువులు ఎంతో స్నేహంగా ఉంటాయి. జంతువుల స్నేహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి.

Viral Video: స్నేహమంటే ఇదేరా.. హృదయానికి హత్తుకుంటోన్న వీడియో..
Viral Video
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 22, 2022 | 5:34 PM

Viral Video: మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ స్నేహ భావం ఎక్కువగా ఉంటుంది. జాతివైరం మరిచి కొన్ని జంతువులు ఎంతో స్నేహంగా ఉంటాయి. జంతువుల స్నేహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. నిత్యం ఇలాంటి వీడియోలను షేర్ చేయడానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కువగా కుక్క -పిల్లి, పాము కప్ప లాంటి జంతువులు స్నేహంగా ఉన్న వీడియోలు మనకు తారసపడుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వీడియోలో వైరల్ అవుతున్న జంతువుకు ఏంటంటే. ఒక చింపాంజీ, తాబేలు. చింపాంజీలు చాలా వరకు మనుషుల్లానే ప్రవర్తిస్తుంటాయి. అచ్చం మనుషుల్లానే అవి చేసే పనులు నవ్వుతెప్పిస్తూ ఉంటాయి. మరికొన్ని హృదయానికి హత్తుకుంటాయి.

తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో ఓ చింపాంజీ చేసిన పని నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ చింపాంజీ ఓ యాపిల్ తింటూ కనిపించింది. అది యాపిల్ తినడం తో పాటు పక్కన ఉన్న తాబేలుకు కూడా తినిపించింది చింపాంజీ. అలా అది తింటూ.. తాబేలుకు తినిపిస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ హార్ట్ టచ్చింగ్ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి