AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: సమంతతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది.. మరోసారి చైతూ ఓపెన్ కామెంట్స్..

సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న చైతూ.. మరోసారి తన మాజీ భార్య సమంత గురించి ఇంట్రెస్టింగా కామెంట్స్ చేశారు.

Naga Chaitanya: సమంతతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది.. మరోసారి చైతూ ఓపెన్ కామెంట్స్..
Naga Chaitanya
Rajitha Chanti
|

Updated on: Jul 22, 2022 | 1:48 PM

Share

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Nagachaitanya) నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం థాంక్యూ . డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజు విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇటీవల సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న చైతూ.. మరోసారి తన మాజీ భార్య సమంత గురించి ఇంట్రెస్టింగా కామెంట్స్ చేశారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తనకు సమంతతో బాగుంటుందని.. మా ఇద్దరి మధ్య సూపర్ హిట్ ప్రేమకథలు వచ్చాయని అన్నారు.

ఎవరితో మీకు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరిందని అనుకుంటున్నారు అని యాంకర్ అడగ్గా.. నాగచైతన్య బదులిస్తూ.. ” నేను ఒకరి గురించి అంటూ ఏం ఆలోచించలేదు. సాయి పల్లవితో లవ్ స్టోరీ సినిమా చేశాను. మా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంది. అలాగే సామ్, నేను కలిసి తెరపై కొన్ని అందమైన ప్రేమకథలను చేశాము. సమంతతో కూడా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది. ఈ ఇద్దరితో తెరపై కెమిస్ట్రీ బాగానే ఉంటుంది ” అంటూ చెప్పుకొచ్చాడు. సామ్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని చెప్పడం ఇది మొదటి సారి కాదు. గతంలో బంగార్రాజు సినిమా ప్రమోషన్లలో సైతం సమంతతో ఆన్ స్క్రీన్ బెస్ట్ కెమిస్ట్రీ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

సామ్, నాగచైతన్య ఇద్దరి కాంబోలో ఏమాయ చేసావే.. మనం.. మజిలీ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబోను అభిమానులు ముద్దుగా చైసామ్ అని పిలుచుకుంటారు. గతేడాది అక్టోబర్ లో వీరిద్దరు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి