AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: కరణ్ ప్రశ్న.. మధ్యలోనే బ్రేక్ వేసిన సమంత.. ‘మాజీ భర్త’ అంటూ కామెంట్స్..

నువ్వు నీ భర్త విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత" అంటూ కరణ్ అడుగుతుండగా..

Samantha: కరణ్ ప్రశ్న.. మధ్యలోనే బ్రేక్ వేసిన సమంత.. 'మాజీ భర్త' అంటూ కామెంట్స్..
Samantha Koffee With Karan
Rajitha Chanti
|

Updated on: Jul 22, 2022 | 8:23 AM

Share

నాగచైతన్యతో విడాకుల అనంతరం కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది సమంత (Samantha). వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ఇప్పటికే శాకుంతలం సినిమా కంప్లీట్ చేసిన సామ్.. ప్రస్తుతం యశోద, ఖుషి సినిమాల చిత్రీకరణలో పాల్గోంటుంది. ఇందులో ఒక్క పాట్ మినహా.. మిగతా షూట్ పూర్తిచేసుకుంది యశోద చిత్రం. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. మరోవైపు హీరోయిన్ తాప్సీ నిర్మాణంలో బాలీవుడ్ అరంగేట్రం చేయబోతుంది. తాజాగా అత్యంత ప్రేక్షకాధరణ పొందిన కాఫీ విత్ కరణ్ షోలో బీటౌన్ స్టార్ అక్షయ్ కుమార్‏తో కలిసి సందడి చేసింది. లైఫ్.. మ్యారెజ్.. విడాకుల గురించి చెప్పుకొచ్చింది.

కరణ్ ఆమె వ్యక్తిగత జీవితం గురించి పలు ప్రశ్నలు వేశాడు. అందులో భాగంగా.. “నువ్వు నీ భర్త విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత” అంటూ కరణ్ అడుగుతుండగా.. మధ్యలో కలుగజేసుకుని మాజీ భర్త అని చెప్పింది సామ్. ఆ సందర్భంలోనే గొంతు సవరించుకోవడానికి ప్రయత్నించడం కూడా చూడవచ్చు. దీంతో కరణ్ ఆమెకు సారీ చెబుతూ.. సోషల్ మీడియాలో మీ జీవితం గురించి ఎందుకు ఎక్కువగా ఉంచారు ? దాని వల్లే మీపై ఎక్కువ ట్రోలింగ్ జరిగిందని అనుకుంటున్నావా ? అని ప్రశ్నించాడు.

సామ్ మాట్లాడుతూ.. “నేను మొదటి నుంచి పారదర్శకంగా ఉండడం వలన నాపై వచ్చిన రూమర్స్ పై ఫిర్యాదు చేయలేకపోయాను. ఒక్కసారి విడిపోయాక నావద్ద ఎలాంటి సమాధానాలు లేవు. ప్రేక్షకులు ఎప్పుడూ నా జీవితంలో ఒక భాగమే. వాళ్లు నా జీవితంలో చాలా ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే నా జీవితం గురించి వాళ్లకు వెల్లడించాను. కానీ ఆ సమయంలో సమాధానాలు లేవు నా దగ్గర. నేను దాని నుంచి దూరం వచ్చాను.. ఇప్పుడు పర్వాలేదు ” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

విడాకుల తర్వాత తన జీవితం చాలా కష్టంగా గడిచిందని.. కానీ ప్రస్తుతం బాగానే ఉందని.. గతంలో కంటే ఇప్పుడు మరింత బలంగా ఉన్నానని తెలిపింది.

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..