AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: విడాకుల తర్వాత జీవితం కష్టంగా అనిపించింది.. ఆ ప్రకియ అంత సులువుగా జరగలేదు. ఓపెన్‌ అయిన సమంత..

Samantha: నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారం అప్పట్లో పెద్ద హాట్‌ టాపిక్‌. చూడముచ్చటి జంట విడిపోయారనే వార్తను వారి ఫ్యాన్స్‌ చాలా రోజుల పాటు జీర్ణించుకోలేకపోయారు. విడాకుల వార్త...

Samantha: విడాకుల తర్వాత జీవితం కష్టంగా అనిపించింది.. ఆ ప్రకియ అంత సులువుగా జరగలేదు. ఓపెన్‌ అయిన సమంత..
Narender Vaitla
|

Updated on: Jul 22, 2022 | 6:05 AM

Share

Samantha: నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారం అప్పట్లో పెద్ద హాట్‌ టాపిక్‌. చూడముచ్చటి జంట విడిపోయారనే వార్తను వారి ఫ్యాన్స్‌ చాలా రోజుల పాటు జీర్ణించుకోలేకపోయారు. విడాకుల వార్త అబద్ధమైతే బాగుండు అని చాలా మంది అనుకున్నారు. అయితే ఈ జంట తమ వివాహ బంధానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ చేసిన ప్రకటన అందరినీ షాక్‌కి గురి చేసింది. ఇక ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి జీవితాల్లో వారు బిజీగా మారిపోయారు.

ఇదిలా ఉంటే విడాకుల తర్వాత సమంత విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. విడాకులకు సమంత కారణం అంటూ, భరణం కింద రూ. కోట్ల రూపాయలు డిమాండ్‌ చేసిందంటూ సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. దీంతో ఒకానొక సమయంలో ఈ వార్తలపై సామ్‌ కోర్టు వరకు కూడా వెళ్లింది.

అయితే విడాకుల సమయంలో తాను నరకం అనుభవించానని సమంత తాజాగా తెలిపింది. కాఫీ విత్‌ కరణ్‌ 7వ సీజన్‌లో భాగంగా సమంత పాల్గొన్న ఇంటర్వ్యూ గురువారం ప్రసారమైంది. ఈ షోలో సమంత నాగచైతన్యతో విడాకుల వ్యవహారంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ విషయమై సామ్‌ మాట్లాడుతూ.. ‘ విడాకుల సమయంలో జీవితం కష్టంగా మారింది. ఆ పక్రియ అంత సులువుగా ఏం జరగలేదు.

ఇవి కూడా చదవండి

ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఇప్పుడు పరిస్థితులు బాగు పడ్డాయి. గతంలో కంటే నేను ఇప్పుడు చాలా బలంగా మారాను’ అని భావోద్వేగానికి గురైంది సమంత. ఇక కరణ్‌ డబ్బు కోసం మీరు చేయని పని ఏంటని అడగ్గా.. నేను డబ్బు కోసం చేయని పనుల్లో సినిమాతో పాటు చాలా విషయాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..