Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం నుంచి మరో అప్డేట్.. మూడో సాంగ్ వచ్చేది అప్పుడే..

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.

Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం నుంచి మరో అప్డేట్.. మూడో సాంగ్ వచ్చేది అప్పుడే..
Nithiin
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 21, 2022 | 10:06 PM

యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మాచర్ల నియోజకవర్గం. డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. పొలిటికల్ యాక్షన్ కమర్షియల్ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ నితిన్ ఐఏఎస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ యూట్యూ్బ్ ను షేక్ చేశాయి.

ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి లేటేస్ట్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా నుంచి అదిరింది అనే మూడవ పాటను ఈనెల 23న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ సినిమాను నిద్రిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన వెన్నెల కిషోర్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.