Balakrishna: మాస్ లుక్‍లో అదరగొట్టిన బాలకృష్ణ.. నెట్టింట్లో లీకైన ఫోటోస్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..

అందులో బాలకృష్ణ మాస్ లుక్‏లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. తెల్ల ప్యాంటు, చొక్కాలో ఉన్న బాలకృష్ణ.. చల్లగాలిని ఆస్వాదిస్తూ కుర్చీపై కుర్చొని లంచ్ చేస్తున్నారు.

Balakrishna: మాస్ లుక్‍లో అదరగొట్టిన బాలకృష్ణ.. నెట్టింట్లో లీకైన ఫోటోస్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..
Nandamuri Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 21, 2022 | 5:25 PM

అఖండ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna). మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. ప్రస్తుతం బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. బాలయ్య కెరీర్‏లో 107వ (NBK ) చిత్రంగా రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి లీకైన బాలయ్య ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

అందులో బాలకృష్ణ మాస్ లుక్‏లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. తెల్ల ప్యాంటు, చొక్కాలో ఉన్న బాలకృష్ణ.. చల్లగాలిని ఆస్వాదిస్తూ కుర్చీపై కుర్చొని లంచ్ చేస్తున్నారు. షూటింగ్ చోట కనీసం క్వారవాన్ కూడా లేకుండా లోకేషన్ లోనే ఎంతో సింపుల్ గా భోజనం చేస్తూ కనిపించారు.

Balakrishna

Balakrishna

ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. బాలయ్య సింప్లిసిటికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. మరో మూడు రోజుల పాటు యాగంటి, కర్నూల్, ఓర్వకల్లు, పంచలింగాల ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ చేయబోతున్నారు.