Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: రామ్ చరణ్‏ను ఢీకొట్టనున్న ఆ కోలీవుడ్ స్టార్.. ఆర్సీ 15 మూవీలో మహేష్ విలన్..

ఇప్పటికే ఈ మూవీ నుంచి లీకైన చరణ్ ఫోటోస్ చూస్తే.. ఆర్సీ 15పై మరింత హైప్ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో

Ram Charan: రామ్ చరణ్‏ను ఢీకొట్టనున్న ఆ కోలీవుడ్ స్టార్.. ఆర్సీ 15 మూవీలో మహేష్ విలన్..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 21, 2022 | 5:08 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో చెర్రీ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని టాక్. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‏తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తో్న్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి లీకైన చరణ్ ఫోటోస్ చూస్తే.. ఆర్సీ 15పై మరింత హైప్ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో చరణ్ ప్రతినాయకుడిగా బాలీవుడ్ విలక్షణ నటుడు ఎస్ జే సూర్య నటించనున్నాడట. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీలో విలన్ పాత్రలో మెప్పించారు సూర్య. ఇక ఇప్పుడు మరోసారి ప్రతినాయకుడిగా అలరించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ ముఖ్యమంత్రి కొడుకుగా కనిపించనున్నారని టాక్. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ గత కొద్ది రోజులుగా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడ వేసిన భారీ సెట్స్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో పాల్గొనడానికి కియారా కూడా ఇటీవలే వచ్చేసింది.