Anushka Shetty: ‘ఈ 17 సంవత్సరాలలో నేనే బెస్ట్ కోస్టార్ అంటా’.. అనుష్క గురించి నవీన్ పోలీశెట్టి ఇంట్రెస్టింగ్ ట్వీట్..

డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం అరుంధతితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత విక్రమార్కుడు, డాన్, శౌర్యం, వేదం వంటి హిట్ చిత్రాల్లో నటించి

Anushka Shetty: 'ఈ 17 సంవత్సరాలలో నేనే బెస్ట్ కోస్టార్ అంటా'.. అనుష్క గురించి నవీన్ పోలీశెట్టి ఇంట్రెస్టింగ్ ట్వీట్..
Anushka Shetty
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 21, 2022 | 4:47 PM

టాలీవుడ్ జేజమ్మగా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty). సూపర్ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆనతి కాలంలోనే స్టార్ హీరోస్ సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్‏గా కొనసాగింది. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం అరుంధతితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత విక్రమార్కుడు, డాన్, శౌర్యం, వేదం వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక జక్కన్న తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయింది. బాహుబలి 2 తర్వాత అనుష్క నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు.చాలా కాలం తర్వాత స్వీటీ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సరసన నటిస్తోంది. నేటికి అనుష్క ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసి 17ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టితో నటిస్తోన్న ప్రాజెక్ట్ సెట్‏లో ఆమె సెలబ్రెషన్స్ చేసుకుంది.

అనుష్కకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సెట్‏లో స్వీటీ కేక్ కట్ చేసిన ఫోటోస్ షేర్ చేసుకుంది. మరోవైపు హీరో నవీన్ పోలిశెట్టి సైతం అనుష్కకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ.. 2005 నుంచి ఇప్పటివరకు అనుష్క కెరీర్‏లో నేనే బెస్ట్ కోస్టార్ అంటా P అని క్యాప్షన్ ఇచ్చాడు. “ఈ 17 సంవత్సరాలలో నేనే బెస్ట్ కోస్టార్ అంటా.. P. ఇప్పటివరకు ఈ అద్భుతమైన ప్రయాణానికి అభినందనలు. మా సినిమా షూటింగ్ జరుగుతుంది. మళ్లీ యూవీ క్రియేషన్స్ రూటర్ ఆఫ్ చేస్తే లోపల అప్డేట్ ఇచ్చాను ” అంటూ రాసుకొచ్చారు.

ట్వీట్..

నవీన్ ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.