Nayanthara – Vignesh Shivan: రూమర్స్‏కు చెక్ పెట్టిన నెట్‏ఫ్లిక్స్.. నయన్, విఘ్నేష్ ప్రీ వెడ్డింగ్ ఫోటోస్ చూశారా ?..

డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంపై నెట్‏ఫ్లిక్స్ ఆగ్రహం వ్యక్తం చేసిందని.. ఈ క్రమంలోనే డీల్ క్యాన్సిల్ చేసుకుని

Nayanthara - Vignesh Shivan: రూమర్స్‏కు చెక్ పెట్టిన నెట్‏ఫ్లిక్స్.. నయన్, విఘ్నేష్ ప్రీ వెడ్డింగ్ ఫోటోస్ చూశారా ?..
Nayan Vignesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 21, 2022 | 3:47 PM

ఏడేళ్లు ప్రేమలో ఉన్న లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), డైరెక్టర్ విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) పెళ్ళి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. జూన్ 9న తమిళనాడులోని మహాబలేశ్వరంలోని ఓ హోటల్ రిసార్ట్‏లో కుటుంబసభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే వీరి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఇటీవల నయన్ దంపతులతో నెట్ ఫ్లిక్స్ డీల్ క్యాన్సిల్ చేసుకుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంపై నెట్‏ఫ్లిక్స్ ఆగ్రహం వ్యక్తం చేసిందని.. ఈ క్రమంలోనే డీల్ క్యాన్సిల్ చేసుకుని రూ. 25 కోట్లు తిరిగి చెల్లించాలని కోరుతున్నట్లుగా టాక్ నడిచింది. తాజాగా నయన్ దంపతులతో డీల్ క్యాన్సిల్ కావడంపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టింది నెట్‏ఫ్లిక్స్. నయన్, విఘ్నేష్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోస్ నెట్టింట షేర్ చేసింది.

సముద్ర తీరాన నయన్, విఘ్నేష్ శివన్ కలిసి ఫోటోలకు అందంగా ఫోజులిచ్చారు. త్వరలో ‘బియాండ్ ఫెయిరీ టేల్’ వీడియోను రిలీజ్ చేస్తామని నెట్ ఫ్లిక్స్ తెలిపింది. నయన్, విఘ్నేష్ పెళ్లి వీడియోను డైరెక్టర్ గౌతమ్ మీనన్ చిత్రీకరించారని.. భారీ ధరకు స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రజనీకాంత్, షారూఖ్ ఖాన్, సూర్య, జ్యోతిక, మణిరత్నం, అనిరుధ్ రవిచందర్ వంటి ప్రముఖలు హజరయ్యారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.