AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: చిరుతో హీరోయిన్ గా జోడీ కట్టి.. అనంతరం.. చెల్లి, అక్క, తల్లిగా నటించిన ఏకైక నటి ఎవరో తెలుసా!

1975 లో స్టార్ హీరోయిన్ గా వెండి తెరపై ఓ రేంజ్ లో వెలుగు వెలిగి.. కాలక్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా షిఫ్ట్ అయిన సీనియర్ నటి.. మెగాస్టార్ చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించి.. అనంతరం చెల్లి, అక్క, కాలక్రమంలో అమ్మగా నటించిన ఆ సీనియర్ నటి ఎవరో తెలుసా .. 

Megastar Chiranjeevi: చిరుతో హీరోయిన్ గా జోడీ కట్టి.. అనంతరం.. చెల్లి, అక్క, తల్లిగా నటించిన ఏకైక నటి ఎవరో తెలుసా!
Megastar
Surya Kala
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 21, 2022 | 6:55 PM

Share

Megastar Chiranjeevi: సినీ పరిశ్రమలో హీరోల కెరీర్ కంటే.. హీరోయిన్ కెరీర్ తక్కువ అన్న సంగతి తెలిసిందే. అరవై ఏళ్ళు వచ్చినా హీరోగా నటిస్తారు తమ కూతురు వయసున్న హీరోయిన్స్ తో జోడీ కట్టి ఆడిపాడతారు. అయితే హీరోయిన్ల పరిస్థితి మాత్రం చిత్ర పరిశ్రమలో భిన్నం. హీరోయిన్ గా తమ ఫేమ్ ను కొన్నేళ్ళకే కోల్పోతారు.. అవకాశాలు తగ్గాక.. ముఖ్యంగా పెళ్లి అయిన  తర్వాత హీరోయిన్లు ఎక్కువుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోతారు. అక్క, చెల్లి, వదిన, అమ్మ క్యారెక్టర్స్ కు షిఫ్ట్ అవుతారు. టాలీవుడ్ కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ వుడ్ అయినా ఇదే పరిస్థితి.. ఇప్పుడు మాత్రమే కాదు.. సినీ పరిశ్రమలో ఇదే పద్దతి ఎప్పటినుంచో కొనసాగుతూనే ఉంది. సుజాత, జయసుధ, వంటి వారు అనేక మంది ఉన్నారు. 1975 లో స్టార్ హీరోయిన్ గా వెండి తెరపై ఓ రేంజ్ లో వెలుగు వెలిగి.. కాలక్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా షిఫ్ట్ అయిన సీనియర్ నటి..  మెగాస్టార్ చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించి.. అనంతరం చెల్లి, అక్క, కాలక్రమంలో అమ్మగా నటించిన ఓ సీనియర్ నటి ఎవరో తెలుసా ..

శ్రీలంకలో పుట్టిన కేరళ కుట్టి సుజాత..  1975లో తమిళ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో గోరింటాకు సినిమాతో అడుగు పెట్టారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ వంటి భాషల్లో హీరోయిన్ గా స్టార్ హీరోలకు జతగా నటించారు. స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు సుజాత. సుమారు 300 సినిమాల్లో నటించారు.

Chiru Sujatha

Chiru Sujatha

1980 లో కృష్ణం రాజు, చిరంజీవి మల్టీస్టార్ సినిమా ప్రేమ తరంగాలు. ఈ  మూవీలో సుజాత హీరోయిన్. చిరుకు జోడీగా నటించింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 1982 లో చిరుకు చెల్లెలుగా సీతాదేవి సినిమాలో నటించారు. అనంతరం చిరుకు అక్కగా 1984లో అగ్నిగుండం సినిమాలో నటించారు సుజాత..  తర్వాత సుజాత తల్లిగా మారిపోయారు..1990లో మెగాస్టార్ చిరంజీవి నటించిన బిగ్ బాస్ సినిమాలో చిరంజీవి తల్లిగా సుజాత నటించడం విశేషం.. చిరంజీవికి చెల్లెలుగా నటించి ఆపై హీరోయిన్ గా నటించిన హీరోయిన్లు ఉన్నారు.. కానీ హీరోయిన్, చెల్లి, అక్క, అమ్మ ఇలా అన్ని పాత్రలు పోషించిన ఏకైక నటి సుజాత కావడం విశేషం.

ఇవి కూడా చదవండి
Chiru Sujta

Chiru Sujta

కేరళకు చెందిన సుజాత తండ్రి వృత్తి రీత్యా శ్రీలంకలో పుట్టింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే తబస్విని చిత్రంతో వెండి తెరపై అడుగు పెట్టి.. ఎన్నో సినిమాలో హీరోయిన్ గా నటించి తన నటనతో భారీ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకుంది కేరళ కుట్టి.. అనారోగ్యంతో 58 ఏళ్ళ వయసులో చెన్నైలోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!