Kaali Poster Row: లీనాపై చర్యలు తీసుకోవాలి.. హిందూ దేవుళ్లను అవమానించడం ఫ్యాషన్ అయిందంటూ రవి కిషన్ ఆగ్రహం

కొంతమంది హిందూ దేవుళ్ళను , దేవతలను తప్పుడు రూపంలో చూపించడం ప్రారంభించారు. నేనే ఒక పండితుడి కొడుకునని.. ఇలా హిందూ దేవుళ్లను అవమానిస్తుంటే నాకు బాధ అనిపిస్తుందని రవి కిషన్ చెప్పారు

Kaali Poster Row: లీనాపై చర్యలు తీసుకోవాలి.. హిందూ దేవుళ్లను అవమానించడం ఫ్యాషన్ అయిందంటూ రవి కిషన్ ఆగ్రహం
Ravi Kishan On Leena Manime
Follow us

|

Updated on: Jul 08, 2022 | 5:01 PM

Kaali Poster Row: దర్శకురాలు లీనా మణిమేకలై తీసిన వివాదాస్పద డాక్యుమెంటరీ చిత్రం ‘కాళి’. ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేసిన కాలి పోస్టర్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. డాక్యుమెంటరీ కాళి పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ప్రతి ఒక్కరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.  వాస్తవానికి ‘కాళి’ చిత్రం పోస్టర్‌లో హిందూ దేవత కాళి ధూమపానం చేస్తూ ఎల్‌జిబిటిక్యూ జెండాను పట్టుకున్నట్లు చూపించారు. దీంతో ఈ చిత్ర దర్శకురాలు లీనా లీనా మణిమేకలై పై అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టర్ ప్రపంచ వ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ వివాదం రాజకీయ రంగుని పులుముకుంది.  ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ కూడా లీనాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రముఖ నటుడు రవి కిషన్ ఓ ఇంటర్వ్యూలో దర్శకురాలు లీనా మణిమేకలైపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ చిత్రం పోస్టర్‌పై అనేక విషయాలు మాట్లాడాడు. కాళీ పోస్టర్‌ని చూసిన రవి కిషన్, సినిమా పోస్టర్‌ను సెన్సేషనల్‌గా మార్చి, తెల్లవారి ప్రశంసలు అందుకున్నారని, ఈ విధంగా లీనా తన పని తాను చేసుకుందని..  ఆమె తన ప్రణాళికలలో విజయం సాధించిందని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రవి.. ‘మన దేవుళ్లను, దేవతలను ఇలా అవమానించడం చాలా ఏళ్లుగా చూస్తున్నాను. 2014 సంవత్సరం తరువాత, డిజిటల్ భారత్ వినియోగం పెరిగింది.  అప్పటి నుండి కొంతమంది హిందూ దేవుళ్ళను , దేవతలను తప్పుడు రూపంలో చూపించడం ప్రారంభించారు. నేనే ఒక పండితుడి కొడుకునని.. ఇలా హిందూ దేవుళ్లను అవమానిస్తుంటే నాకు బాధ అనిపిస్తుందని రవి కిషన్ చెప్పాడు. ఈ పోస్టర్ చూసి నాకు చాలా బాధగా ఉంది. ఈ అంశంపై సభలో గళం విప్పుతాను. మన దేవతలను తప్పుడు రూపంలో చూపించిన  సినిమాని, పోస్టర్స్‌ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు,

కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్‌ చేస్తాం- రవికిషన్‌ హిందూ దేవుళ్లను, సంప్రదాయాలను అవమానించే వారిని శిక్షించడం కోసం కఠినమైన చట్టం తీసుకుని రావాలని సభలో విజ్ఞప్తి చేస్తానని అన్నారు.   ఇలాంటి చిత్రాలను ఎప్పుడూ చూడకూడదని, అలాంటి వారిని ప్రోత్సహించకూడదని, ఇందుకోసం తన ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈ లేడీని పునరావాస కేంద్రానికి పంపాలని డిమాండ్‌ చేస్తానని హౌస్‌లో చెబుతానని రవికిషన్‌ చెబుతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..