Samantha: సినీ రంగాన్ని ఎంచుకోవడానికి ఆ పరిస్థితులే కారణం.. ఆసక్తికర విషయాలు పంచుకున్న సామ్‌..

Samantha: సమంత.. సగటు సినీ ప్రేక్షకుడికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హీరోయిన్లలో సూపర్‌ స్టార్‌ రేంజ్‌ను అందుకున్న అతికొద్ది మంది నటీమణుల్లో సమంత ఒకరు...

Samantha: సినీ రంగాన్ని ఎంచుకోవడానికి ఆ పరిస్థితులే కారణం.. ఆసక్తికర విషయాలు పంచుకున్న సామ్‌..
Samantha
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 22, 2022 | 6:50 AM

Samantha: సమంత.. సగటు సినీ ప్రేక్షకుడికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హీరోయిన్లలో సూపర్‌ స్టార్‌ రేంజ్‌ను అందుకున్న అతికొద్ది మంది నటీమణుల్లో సమంత ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ సౌత్‌లో స్టార్‌ హీరోయిన్స్‌లో ఒకరిగా ఎదిగారు సమంత. అప్పట్లో రూ. కోటి రెమ్యునరేషన్‌ అందుకున్న నటీమణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న సామ్‌ తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీని ఏలారు. అనంతరం నాగచైతన్యతో ప్రేమ, వివాహంతో తెలుగువారి కోడలిగా మారింది. అయితే అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో చై, సామ్‌ విడిపోవడం తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.

దీంతో విడాకుల తర్వాత సమంత తన కెరీర్‌ను మళ్లీ రీస్టార్ట్‌ చేసింది. రెట్టించిన ఉత్సాహంతో వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ బాలీవుడ్‌లోనూ దుమ్మురేపడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందీ బ్యూటీ. బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైన సమంత అక్కడి వారి దృష్టిని కూడా తనవైపు తిప్పుకుంది. ఇందులో భాగంగానే తాజాగా కాఫీ విత్‌ కరణ్‌ షోకు సమంతను ఆహ్వానించారు. ఈ షోకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ గురువారం ప్రసారమైంది. ఇందులో అక్షయ్‌ కుమార్‌తో పాటు పాల్గొన్న సమంత.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తన కెరీర్‌ తొలినాళ్లకు సంబంధించిన కొన్ని విషయాలను సామ్‌ షేర్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘ఇంట్లో ఉన్న పరిస్థితుల కారణంగానే నేను సినిమా రంగాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో పై చదువులు చదువుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఆ సమయంలో నా చదువుకయ్యే ఖర్చును భరించలేనని మా నాన్న చెప్పిన మాటలే నా జీవితాన్ని మార్చేశాయి. ఆ సమయంలో అనివార్యంగా సినిమా రంగంలోకి వచ్చాను. అయితే ఇప్పుడు నేను ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది సమంత.

ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆయుష్మాణ్‌ ఖురానాతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు వరుణ్‌ దావన్‌తో ఒక సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటితో పాటు ఓ హాలీవుడ్‌ చిత్రంలోనూ సామ్‌ నటిస్తోంది. ఇక తెలుగులో శాకుంతలం, యశోద చిత్రాలతో బిజీగా ఉంది సామ్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..