AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: నాగచైతన్య, మీరు ఇప్పటికీ స్నేహపూర్వకంగానే ఉన్నారా.? సమంత షాకింగ్ కామెంట్స్‌..

Samantha: నాగచైతన్య (Nagachiatanya), సమంతల విడాకుల వ్యవహరం ఎంత చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడాకులు ప్రకటించి...

Samantha: నాగచైతన్య, మీరు ఇప్పటికీ స్నేహపూర్వకంగానే ఉన్నారా.? సమంత షాకింగ్ కామెంట్స్‌..
Narender Vaitla
|

Updated on: Jul 21, 2022 | 10:38 PM

Share

Samantha: నాగచైతన్య (Nagachiatanya), సమంతల విడాకుల వ్యవహరం ఎంత చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడాకులు ప్రకటించి అభిమానులను ఒక్కసారిగా షాకింగ్‌కు గురి చేసి విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ సినిమాలతో బిజీగా మారిపోయారు. ఓవైపు నాగచైతన్య వరుస సినిమాలను లైన్‌లో పెడితే.. మరోవైపు సమంత మునుపటి కంటే జోష్‌తో బాలీవుడ్‌లోనూ సినిమానూ చేస్తూ దూసుకెళుతోంది. ఇదిలా ఉంటే ఈ జంట అసలు ఎందుకు విడిపోయిందనే అంశంపై ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు. నెట్టింట రకరకాల పుకార్లు షికార్లు చేశాయని కానీ, దీనిపై ఈ జంట మాత్రం స్పందించలేదు.

ఇక ప్రస్తుతం సామ్‌, చై స్నేహపూర్వకంగానే ఉన్నారా.? అన్న ప్రశ్నకు సమంత ఆసక్తికర సమాధానం ఇచ్చింది. తాజాగా సమంత కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ షోకు సంబంధించిన ప్రోమోలు ఇంటర్వ్యూపై ఆసక్తి పెంచేశాయి. ఇక ఈ షో ఫుల్ ఎపిసోడ్‌ గురువారం టెలికాస్ట్‌ అయ్యింది.. ఈ సందర్భంగా కరణ్‌ సమంతను.. ‘ప్రస్తుతం మీరు, నాగచైతన్య స్నేహపూర్వకంగానే ఉన్నారా’.? అని ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన సామ్‌.. ‘ఒకవేళ మీరిద్దరు ప్రస్తుతం మమ్మల్ని ఒకే గదిలో ఉంచితే మీరు కచ్చితంగా పదునైన వస్తువులను అందుబాటులో లేకుండా చూడాలి. ఇప్పటికిప్పుడైతే నా అభిప్రాయం ఇదే. అయితే భవిష్యత్తులో మీమిద్దరం మళ్లీ స్వేహపూర్వకంగా మారొచ్చు’ అని చెప్పుకొచ్చింది. దీంతో సామ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాయి. అంటే సామ్‌కు చైతన్యపై అంత కోపం ఉందా అని నెట్టింట ఫ్యాన్స్‌ చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం.. విజయ్ దేవరకొండతో ఖుషీ, యశోద, శాకుంతలం చిత్రాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. వీటితో పాటు హాలీవుడ్‌లోనూ ఓ సినిమాలో నటిస్తోన్న సామ్‌ బాలీవుడ్‌లో కొన్ని సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి. వీటితో పాటు ఓ వెబ్‌ సిరీస్‌లోనూ సమంత నటిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..