Thank You Twitter Review: చైతూ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడ్డట్టేనా ?.. థాంక్యూ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే..

థాంక్యూ గుడ్ మూవీ. చైతూ యాక్టింగ్ సూపర్. క్లాస్ అయినా.. మాస్ అయిన చై అంతే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Thank You Twitter Review: చైతూ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడ్డట్టేనా ?.. థాంక్యూ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే..
Thank You
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 22, 2022 | 8:44 AM

లవ్ స్టోరీ తర్వాత అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న చిత్రం థాంక్యూ (Thank You). డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రాశీఖన్నా, మాళవికా మోహన్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. పాటలకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో చైతూ మరింత స్మార్ట్ అండ్ స్టైలీష్ లుక్‏లో కనిపిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ అసోసియేష‌న్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేష‌న్‌తో శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు (జూలై 22న) థియేటర్లలో గ్రాండ్‏గా విడుదలైంది. ఇప్పటికే మూవీ చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకుంటున్నారు. ఇక ఉదయం నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.

థాంక్యూ గుడ్ మూవీ. చైతూ యాక్టింగ్ సూపర్. క్లాస్ అయినా.. మాస్ అయిన చై అంతే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఫస్ట్ హాఫ్ వెరీ గుడ్.. సెకండ్ హాఫ్ ఎమోషనల్. చైతూ హిట్ స్ట్రైక్ కంటిన్యూ అవుతుంది. మ్యూజిక్, విజువల్స్ సూపర్ అంటూ ట్వీట్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.