AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: చైతూతో విడాకులు.. రూ. 250 కోట్ల భరణంపై స్పందించిన సమంత..

విడిపోయిన తర్వాత వీరిద్దరు ఎవరికీ వారు సినిమాలతో బిజీగా మారిపోయారు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Samantha: చైతూతో విడాకులు.. రూ. 250 కోట్ల భరణంపై స్పందించిన సమంత..
Samantha
Rajitha Chanti
|

Updated on: Jul 22, 2022 | 7:04 AM

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha).. అక్కినేని నాగచైతన్య అనుహ్యంగా విడాకులు తీసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట విడాకుల ప్రకటన చేయడంతో అటు అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు సైతం షాకయ్యారు. ఎప్పుడూ సరదగా కనిపించే ఈ జంట విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియలేదు. విడిపోయిన తర్వాత వీరిద్దరు ఎవరికీ వారు సినిమాలతో బిజీగా మారిపోయారు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే తాను విడాకుల సమయంలో రూ. 250 కోట్ల భరణం తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై కూడా స్పందించింది.

సమంత మాట్లాడుతూ.. “విడాకులు తీసుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ. అది అంత సామరస్యంగా జరగలేదు. ప్రస్తుతం బాగానే ఉంది. గతంలో కంటే ఎక్కువ బలంగా ఉన్నాను ” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే రూ. 250 కోట్ల భరణం తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ…”నేను రూ.250 కోట్లు తీసుకున్నట్లు చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఆ వార్తలలో నిజం లేదు. ఈ పుకార్లు వచ్చినప్పుడు నా ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేస్తారేమో అని ఎదురుచూశాను” అని తెలిపింది.

అలాగే చైతన్యకు మీకు మధ్య ఏవైన కఠినమైన భావాలు ఉన్నాయా అని అడగ్గా.. మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే మీరు పదునైన వస్తువులు దాచాల్సి ఉంటుంది అని చెప్పింది. ప్రస్తుతం ఆమె చేతిలో యశోద, శాకుంతలం, ఖుషి సినిమాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో