AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Ali khan: సారా ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదా.. నెట్టింట వైరల్‌ అవుతోన్న అందాల భామ వర్కవుట్ వీడియో..

Sara Ali khan: కేదార్‌నాథ్‌ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్‌ అనతి కాలంలో బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకుంది. పేరుకు స్టార్‌ కిడ్‌ అనే ట్యాగ్‌లైన్‌ ఉన్నా...

Sara Ali khan: సారా ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదా.. నెట్టింట వైరల్‌ అవుతోన్న అందాల భామ వర్కవుట్ వీడియో..
Narender Vaitla
|

Updated on: Jul 22, 2022 | 6:20 AM

Share

Sara Ali khan: కేదార్‌నాథ్‌ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్‌ అనతి కాలంలో బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకుంది. పేరుకు స్టార్‌ కిడ్‌ అనే ట్యాగ్‌లైన్‌ ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ బ్యూటీ. అందం, అభినయంతో కుర్రకారును మెస్మరైజ్‌ చేసిన ఈ చిన్నది వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇక ఒకప్పుడు బొద్దుగా ఉన్న సారా తర్వాత తన డెడికేషన్‌తో స్లిమ్‌గా మారిన విషయం తెలిసిందే. ఎంతలా అంటే సారా పాత ఫొటోలను చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు.

డైటింగ్, వర్కవుట్స్‌ ఇలా తన జీవన శైలిని పూర్తిగా మార్చేసుకొని ఇప్పుడు ఫిట్‌నెస్‌కే పర్యాయపదంగా మారిందీ బ్యూటీ. ఇక మారిన ఆ రూపాన్ని అలాగే పదిలంగా కాపాడుకోవడానికి సారా నిత్యం వర్కవుట్స్‌ చేస్తూనే ఉంది. చాలా మంది తారలు జిమ్‌ బాట పట్టినట్లే సారా కూడా నిత్యం ఏదో ఒక వర్కవుట్‌ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని రోజుల పాటు వర్కవుట్స్‌కి బ్రేక్‌ ఇచ్చిన ఈ బ్యూటీ మళ్లీ ట్రాక్‌ ఎక్కింది. జిమ్‌లో చెమట చిందిస్తూ తెగ కష్టపడుతోంది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న ఈ బ్యూటీ వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేసింది.

సారా వర్కవుట్‌ వీడియో..

ఈ వీడియోతో పాటు.. ‘మళ్లీ తిరిగి వచ్చేశాను. హాలీడే పూర్తయింది. బరువు తగ్గించుకోవడానికి సులభమైన మార్గాలు ఉండవు, కష్టాపడాల్సిందే. సమయంతో సంబంధం లేకుండా ముందుకు వెళుతూనే ఉండాలి. వర్కవుట్స్‌తో పాటు మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి’అంటూ తన వర్కవుట్‌ టిప్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుందీ బ్యూటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..