Samantha: ‘అతని జీవితానికి నేను అభిమానిని..  వారిద్దరితో  ట్రయాంగిల్ లవ్ స్టోరీ’.. సమంత కామెంట్స్..

ఇందులో ముఖ్యంగా కరణ్.. సామ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలను ఎక్కువగా వేశారు. అంతేకాకుండా సామ్, అక్షయ్ ఎపిసోడ్‎లో మరో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హైలేట్ అయ్యాడు.

Samantha: 'అతని జీవితానికి నేను అభిమానిని..  వారిద్దరితో  ట్రయాంగిల్ లవ్ స్టోరీ'.. సమంత కామెంట్స్..
Samantha Akshay
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 22, 2022 | 9:24 AM

కాఫీ విత్ కరణ్ షోలో సమంత (Samantha) సందడి చేసింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‏తో కలిసి ఈషోలో రచ్చ చేసింది సామ్. తన కెరీర్‏లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఊ అంటావా మావ పాటకు అక్షయ్‍తో కలిసి స్టెప్పులేసింది సామ్. ఈ షో ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి ఫుల్ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా గురువారం రాత్రి కాఫీ విత్ కరణ్ షో సామ్, అక్షయ్ ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది. ఇందులో అక్షయ్, సమంత ఎంతో సరదగా కనిపించారు. కరణ్ అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా.. ఇంట్రెస్టింగ్‏గా ఆన్సర్ ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా కరణ్.. సామ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలను ఎక్కువగా వేశారు. అంతేకాకుండా సామ్, అక్షయ్ ఎపిసోడ్‎లో మరో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హైలేట్ అయ్యాడు.

తాను రణవీర్‏గా ఉన్నానని చెప్పింది సమంత. అంతేకాకుండా తనతోపాటు అక్షయ్, రణవీర్ మా ముగ్గురితో ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమాలో నటించాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. సామ్ మాట్లాడుతూ.. ” నేను పూర్తిగా రణవీరిఫై గా ఉన్నాను. నేను అతని జీవితానికి అభిమానిని” తెలిపింది. అలాగే బ్యాచిలర్ పార్టీ ఇవ్వాల్సి వస్తే.. అందులో ఏ బాలీవుడ్ హీరోలతో డ్యాన్స్ చెస్తావు అని అడగ్గా రణవీర్ సింగ్ అని చెప్పేసింది. గతంలో రణవీర్ సింగ్ తో కలిసి సామ్ ఓ వాణిజ్య ప్రకటన చేసింది. ఇక తాను ప్రైవేట్ పార్టీ నిర్వహించాల్సి వస్తే.. తన అతిథుల జాబితాలో రణవీర్ సింగ్ కచ్చితంగా ఉంటారని చెప్పారు అక్షయ్. అలాగే నయనతారతో తన సినిమా జర్నీ చాలా ఎమోషనల్‏గా సాగిందని.. కాతు వాకుల కాదల్ రెండు మూవీ షూటింగ్ చివరి రోజున ఇద్దరం భావోద్వేగానికి గురయ్యామని చెప్పింది.