AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral : మెట్రోలో మరో యువతి హల్‌చల్‌.. శివంగిలా రెచ్చిపోయింది.. పాపం యువకుడు

నిన్న ఓ అమ్మాయి మెట్రో స్టేషన్, మెట్రో రైల్లో అదిరిపోయే డ్యాన్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. ఇప్పుడు తాజాగా మరో యువతి మెట్రోరైల్లో అందరూ చూస్తున్నారని కూడా లేకుండా..

Video Viral : మెట్రోలో మరో యువతి హల్‌చల్‌.. శివంగిలా రెచ్చిపోయింది.. పాపం యువకుడు
Delhi Metro
Jyothi Gadda
|

Updated on: Jul 22, 2022 | 5:56 PM

Share

Video Viral : సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో మనుషులు, జంతులకు సంబంధించిన వీడియోలు ఎన్నో ఉంటాయి. ప్రపంచం నలుమూలల్నించి సోషల్ మీడియాలో విభిన్నమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే మతిపోతుంది కూడా. అలాంటిదే ఈ వీడియో. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇటీవ‌లి కాలంలో మెట్రోలో రకరకాల ఫీట్లు చేస్తున్నారు యువతీ యువకులు. నిన్న ఓ అమ్మాయి మెట్రో స్టేషన్, మెట్రో రైల్లో అదిరిపోయే డ్యాన్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. ఇప్పుడు తాజాగా మరో యువతి మెట్రోరైల్లో అందరూ చూస్తున్నారని కూడా లేకుండా ఓ యువకుడిని చితక్కొట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఘటన ఢిల్లీ మెట్రోరైల్లో జరిగినట్టుగా తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఢిల్లీ మెట్రోలో ఓ యువతి.. యువకుడి చెంప చెల్‌మనిపించింది. దానికి కారణం కూడా ఉంది.. అదేంటంటే.. డ్రెస్ విష‌యంలో యువ‌తి, యువ‌కుడి మ‌ధ్య మాటమాట పెరిగింది. అదే ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. షాపింగ్‌ చేసిన యువతి..వెయ్యి రూపాయలు పెట్టి ఓ టీ ష‌ర్ట్ కొనిందట. ఆ విషయం యువకుడితో చెప్పింది. దానికి అతడు..ఎక్కువ కాస్ట్ పడిందని చెప్పాడట. నూట యాభై పెడితే వచ్చే షర్ట్‌కి వెయ్యి రూపాయలు పెట్టవా అని హెలనగా చెప్పాడట. దాంతో ఆ అమ్మాయి ఇగో హార్ట్‌ అయినట్టుంది. ఒక్కసారిగా యువతి కోపం నశలానికి అంటింది. ఆగ్రహంతో అతని చెంప చెల్లుమనిపించింది. అగకుండా ఎడపెడా వాయించేసింది.

ఇవి కూడా చదవండి

ఇదంతా చూసిన తోటి ప్రయాణికుడు కార్తీక్ అనే వ్యక్తి సీన్ మొత్తం వీడియో తీశాడు. దానికి అతను ఢిల్లీ మెట్రో ఎంటర్‌టైన్ మెంట్ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. 49 సెకన్ల నిడివి గల ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. వీడియో చూసిన ప్రతిఒక్కరూ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో పూర్తి వినోదం..అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ఇక నెటిజన్లు ఒక్కొక్కరు ఒకవిధంగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి