AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేసింది పది సినిమాలే.. ఎంట్రీ ఇచ్చిన ఏడాదికే ఆత్మహత్యాయత్నం..! నటనకు గుడ్ బై చెప్పిన టాలీవుడ్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ తోప్ హీరోయిన్.. చేసింది పదే పది సినిమాలు అందులో సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. పెద్ద హీరోయిన్ గా రాణిస్తూ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు.. కానీ ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరం అయ్యింది.

చేసింది పది సినిమాలే.. ఎంట్రీ ఇచ్చిన ఏడాదికే ఆత్మహత్యాయత్నం..! నటనకు గుడ్ బై చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 21, 2026 | 3:04 PM

Share

కొంతమంది హీరోయిన్స్ తమ నటనతో అందంతో మెప్పిస్తూ సక్సెస్ అవుతున్నారు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. ఒకప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్. చేసింది కొన్ని సినిమాలే కానీ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది ఆ అందాల తార. కానీ ఆతర్వాత ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యింది. స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో సినిమాలకు పూర్తగా గుడ్ బై చెప్పేసింది. అంతే కాదు కెరీర్ పీక్ లో ఉండగానే ఆత్మహత్యకు పాల్పడింది. పదే పది సినిమాలు చేసింది ఆ సినిమాల్లో ఎన్టీఆర్ తో రెండు సినిమాలు, వెంకటేష్ తో ఓ మూవీ చేసింది. ఇంతకూ ఆమె ఎవరో కాదు..

ఆ దర్శకుడి చేతిలో మోసపోయా.. ఏడుసార్లు అబార్షన్ చేయించాడు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్

ఇండస్ట్రీకి వచ్చి ఏడాదికే సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆమె ఎవరో కాదు గజాల. 2001 లో జగపతి బాబు కథానాయకుడిగా వచ్చిన నాలో ఉన్న ప్రేమ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అలాగే 2002లో వచ్చిన ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వెంకటేష్ మల్లీశ్వరి సినిమాలో చిన్న రోల్ చేసింది. అలాగే ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసింది.

ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసా.?

ఆ తర్వాత తొట్టిగ్యాంగ్, అల్లరి రాముడు సినిమాల్లో నటించింది. గజాల హీరోయిన్ గా చివరిగా జానకి వెడ్స్ శ్రీరామ్ అనే సినిమాలో నటించింది. అయితే ఈ అమ్మడు 2002లో ఆత్మహత్యా ప్రయత్నం చేసి చావు నుంచి బయట పడింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. మస్కట్లో జన్మించిన ఈ చిన్నది. జులై 22, 2002 హైదరాబాదులోని బంజారా హిల్స్‌లో ప్రశాంత్ కుటీర్ అనే అతిథి గృహంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆమె సహ నటులు సుల్తానా, అర్జున్ సరైన సమయానికి గుర్తించి నిమ్స్ ఆసుపత్రికి తరలించిన తర్వాత గజాల బ్రతికి బయటపడింది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు మాత్రం బయటకు రాలేదు. అయితే గజాల ఆత్మహత్యా ప్రయత్ననికి ప్రేమ వ్యవహారమే కారణం అని అప్పటిలో వార్తలు వచ్చాయి.గజాల హిందీ టీవీ నటుడైన ఫైజల్ రజా ఖాన్‌ను వివాహం చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. 2016 ఫిబ్రవరి 24 న హిందీ టీవీ నటుడు ఫైజల్ రజా ఖాన్ ను వివాహం చేసుకుంది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ అమ్మడు.

ఇవి కూడా చదవండి

ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరితో

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us