AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీరకాయ చికెన్ కూర ఇలా చేస్తే.. ఆహా ఓహో అంటూ ముక్కలు మొత్తం లాగించేస్తారు

బీరకాయ చికెన్ కూర ఎప్పుడైనా చేసారా ? ఇది తెలుగు రాష్ట్రాల్లో కొత్తరకం వంటకంగా చూస్తారు. కానీ, కొన్ని చోట్ల ఈ కూర చాలా ఫేమస్. ఈ రెండింటిని కలిపి వండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్. మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీకి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 21, 2026 | 1:44 PM

Share
 కావాల్సిన పదార్థాలు : పావు కిలో బీరకాయ ముక్కలు , పెద్ద ఉల్లిపాయ, అర కిలో చికెన్, 4, కట్ చేసిన పచ్చిమిర్చి,  ఒక టొమాటో,  ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  కారం, అర టీ స్పూన్ పసుపు,  ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా,  2 టేబుల్ స్పూన్స్ నూనె, మీరు కూరల్లో తినేంత ఉప్పును తీసుకోండి.

1 / 5
ముందుగా బీరకాయలను తీసుకుని బాగా కడిగి ముక్కలుగా చేసుకోవాలి. అలాగే, చికెన్ ను కూడా ఉప్పు, పసుపు నీటిలో కడగండి.

2 / 5
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో బీరకాయ ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇక ఇప్పుడు అదే పాన్ లో మూడు స్పూన్లు నూనె వేసి, పచ్చి మిర్చి, టమోటా, ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. ఇక ఇప్పుడు ఈ మిశ్రమంలో బీరకాయ  ముక్కలు, చికెన్ వేసి 15  నిమిషాలు పాటు మూత పెట్టి బాగా ఉడికించాలి.

4 / 5
చికెన్ ఉడికిన తర్వాత  కారం, పసుపు, ఉప్పు, మసాలా పొడులు పొడి వేసి కలిసిపోయే వరకు తిప్పుకోవాలి. చివర్లో కొత్తిమీర కొద్దిగా వేసి కిందకు దించేయండి. అంతే వేడి వేడి  బీరకాయ చికెన్ రెడీ.

5 / 5
Follow Us