AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునాక్‌కు గట్టి షాక్‌.. లిజ్‌ ట్రస్‌కే జై కొడుతున్న టోరీ సభ్యులు.!

బ్రిటన్ ప్రధాని పదవీకి అడుగుదూరంలో రిషి సునాక్‌కు పెద్ద షాక్ తగిలింది..అత్యధిక కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఓట్లతో...

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునాక్‌కు గట్టి షాక్‌.. లిజ్‌ ట్రస్‌కే జై కొడుతున్న టోరీ సభ్యులు.!
Rishi Sunak
TV9 Telugu
| Edited By: |

Updated on: Jul 22, 2022 | 9:43 PM

Share

బ్రిటన్ ప్రధాని పదవీకి అడుగుదూరంలో రిషి సునాక్‌కు పెద్ద షాక్ తగిలింది..అత్యధిక కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఓట్లతో రిషి సునాక్ ప్రధాని అవ్వడం ఖాయం అనుకున్నారు..కానీ ఇప్పుడు సీన్ రివర్స్‌ అయినట్లు బ్రిటన్‌ ‘యూగోవ్’ సంస్థ సర్వే చెబుతోంది. ఐదో రౌండ్‌లోనూ విజయం సాధించి ప్రధాని పదవికి అడుగు దూరంలో ఉన్న రిషికి ఇలా ఝలక్ ఇచ్చారు ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌..కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు రిషి, లిజ్‌ ట్రస్‌లలో ఎవరికి మద్దతుగా ఉన్నారు అనే విషయంపై యూగోవ్ సర్వే నిర్వహించింది. ఇందులో 730 మంది టోరీ సభ్యులు పాల్గొనగా.. 62 శాతం మంది లిజ్‌ ట్రస్‌కే తమ ఓటు అని చెప్పారు. 38 శాతం మంది రిషి సునాక్‌కు మద్దతుగా నిలిచారు. సర్వేల్లో గతవారం వరకు రిషి సునాక్‌పై 19 శాతం పాయింట్లు లీడ్ సాధించిన ట్రస్‌ ఇప్పుడు 24శాతం పాయింట్ల లీడ్‌కు ఎగబాకడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేసింది..దీంతో కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది ఎంపీలు రిషికి మద్దతుగా నిలిచినప్పటికీ.. పార్టీ సభ్యుల్లో మాత్రం ట్రస్‌కే ఎక్కువ ఆదరణ ఉన్నట్లు స్పష్టమవుతోంది. పార్టీలో ఆమెకు మంచి గుర్తింపు ఉండటమే ఇందుకు కారణం. అంతేగాక కొద్ది రోజుల్లో సమ్మర్ క్యాంపెయిన్ ప్రారంభవుతుంది. రిషి, ట్రస్ టోరీ సభ్యులను కలిసి తమకు మద్దతు తెలపాలని జోరుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ట్రస్‌కు లభించే మద్దతు ఇంకా పెరుగుతుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. బ్రిటన్‌లోని బెట్టింగ్‌ రాయుళ్లు కూడా ట్రసే తమ ఫేవరెట్ అంటున్నారు.బ్రిటన్ ప్రధానిని ఎన్నుకునేందుకు కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల బ్యాలెట్ ఓటింగ్ ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరగనుంది.

Follow Us
రోహిత్, కోహ్లీకే సాధ్యం కాలేదు.. 17 ఫోర్లు, 17 సిక్సర్లతో టీ20..
రోహిత్, కోహ్లీకే సాధ్యం కాలేదు.. 17 ఫోర్లు, 17 సిక్సర్లతో టీ20..
ఆ సినిమాతో నా జీవితమే మారిపోయింది.. నటుడు జయప్రకాష్ రెడ్డి..
ఆ సినిమాతో నా జీవితమే మారిపోయింది.. నటుడు జయప్రకాష్ రెడ్డి..
జాబిల్లి చెంతకు 'ఆర్టెమిస్-2' వ్యోమగాములతో పాటు చిన్నారి 'బొమ్మ'
జాబిల్లి చెంతకు 'ఆర్టెమిస్-2' వ్యోమగాములతో పాటు చిన్నారి 'బొమ్మ'
ఫ్యాన్స్‌ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి
ఫ్యాన్స్‌ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి
నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్
నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్
సామాన్యుడిపై 'మీ సేవ' భారం.. 50% చార్జీలు పెంపు
సామాన్యుడిపై 'మీ సేవ' భారం.. 50% చార్జీలు పెంపు
ధురంధర్‌2ను తట్టుకుని.. దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ
ధురంధర్‌2ను తట్టుకుని.. దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ
ఈ గింజలను పారేస్తే ఈ భారీ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..
ఈ గింజలను పారేస్తే ఈ భారీ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ శోభా శెట్టి.. వీడియో
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ శోభా శెట్టి.. వీడియో
నిమ్మకాయలు గుత్తులు గుత్తులుగా కాయాలంటే.. జస్ట్ ఇలా చేయండి చాలు..
నిమ్మకాయలు గుత్తులు గుత్తులుగా కాయాలంటే.. జస్ట్ ఇలా చేయండి చాలు..