Crime news: చనిపోయి రెండున్నరేళ్లయినా ఇంట్లోనే డెడ్ బాడీ.. అయినప్పటికీ నెలనెలా అద్దె వసూలు

ప్లాట్ లో ఒంటరిగా నివాసుముంటున్న మహిళ ఓ రోజు మృతి చెందింది. అయితే ఆమె మృతి చెందిందన్న విషయం రెండున్నరేళ్లకు గానీ వెలుగులోకి రాలేదు. ఆమె ఆచూకీ గురించి ఆరా తీస్తుండగా సోఫాలో అస్థిపంజరం కనిపించింది. దానిని పరిశీలించగా అది.....

Crime news: చనిపోయి రెండున్నరేళ్లయినా ఇంట్లోనే డెడ్ బాడీ.. అయినప్పటికీ నెలనెలా అద్దె వసూలు
Crime
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 23, 2022 | 9:56 AM

ప్లాట్ లో ఒంటరిగా నివాసుముంటున్న మహిళ ఓ రోజు మృతి చెందింది. అయితే ఆమె మృతి చెందిందన్న విషయం రెండున్నరేళ్లకు గానీ వెలుగులోకి రాలేదు. ఆమె ఆచూకీ గురించి ఆరా తీస్తుండగా సోఫాలో అస్థిపంజరం కనిపించింది. దానిని పరిశీలించగా అది.. ఆ ప్లాట్ లోనే నివాసుమంటున్న మహిళగా నిర్ధరణ అయింది. అయితే అప్పటికీ ఆమె ఫండ్స్ నుంచి అద్దె వసూలు చేయడం విశేషం. ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు.. ఇది జీర్ణించుకోలేని ఘటన అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. బ్రిటన్ (Britan) లోని పెక్ హామ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఓ అపార్ట్మెంట్ ప్లాట్ లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. అంతే కాకుండా ఆమె జమ చేసుకున్న సొసైటీ ఫండ్స్ నుంచి రెంట్ డబ్బులు వసూలు చేశారు. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో మహిళ ఫ్లాట్‌లోని సోఫాలో అస్థిపంజరం బయటపడింది. వాటిని పరీక్షించగా అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న షీలా సెలియోనేగా గుర్తించారు. డెడ్ బాడీ కుళ్లిపోవడంతో పోస్ట్‌మార్టం నివేదికలో మరణానికి అసలు కారణం తెలియలేదు.

ఆమె చివరిసారిగా ఆగస్టు 2019 లో అద్దె చెల్లించారు. అప్పటి నుంచి షీలా కనిపించకుండా పోయింది. అయితే ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించకుండా ఆ మహిళ సోషల్ ఫండ్స్ నుంచి అద్దె వసూలు చేయడం గమనార్హం. అయితే ఆ డబ్బులు అయిపోవడంతో జూన్ 2020లో ఆమె ఫ్లాట్‌కు గ్యాస్ సరఫరా నిలిపి వేసింది. షీలా ఆచూకీ కనుక్కోవాలంటూ స్థానికులు హౌసింగ్ అసోసియేషన్‌ను, పోలీసులనూ అనేక సార్లు సంప్రందించారు. అయినా లాభం లేకుండా పోయింది. పోలీసులు రెండుసార్లు వచ్చి వెళ్లినా షీలా బతికే ఉన్నారని తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇందుకు గానూ హౌసింగ్ సొసైటీ క్షమాపణలు చెప్పింది.

దీనిపై విచారణ జరిపిన కోర్టు తీవ్ర ఆవేదనభరిత వ్యాఖ్యలు చేసింది. ఎవరి మరణమైనా అది విషాదకరమేనని, రెండేళ్లకుపైగా ఆమెను గుర్తించకుండా ఉండటం జీర్ణించుకోలేని విషయమని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి