Viral: ఒక్కసారిగా గులాబీ వర్ణంలోకి మారిన ఆకాశం.. భయాందోళనలకు గురైన ప్రజలు.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

ఆకాశంలో వింతను చూసి చాలామంది ఇక తమ లైఫ్ ఎండ్ అనుకుని ఇష్టమైన వంటలు చేసుకుని తిన్నారు. ఆప్తులతో ఫోన్లలో మాట్లాడుకున్నారు. మధుర స్మృతులు నెమరువేసుకున్నారు. బావోద్వేగంతో Bye...Bye చెప్పుకున్నారు.

Viral: ఒక్కసారిగా గులాబీ వర్ణంలోకి మారిన ఆకాశం.. భయాందోళనలకు గురైన ప్రజలు.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?
Bizarre Pink Lights
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 23, 2022 | 9:01 AM

Trending: అది పొద్దు కూకే సమయం. అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అంటే మబ్బులు కమ్మేయడం కాదండోయ్. ఆకాశం ఒక్కసారిగా గులాబీ వర్ణంలోకి చేంజ్ అయ్యింది. దీంతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళన చెందారు. ఏదైనా ఉపద్రవం రాబోతుందేమో అని భయపడ్డారు. ఇంతలోనే రూమర్స్ వ్యాప్తి చెందాయి. ఏలియన్స్(Aliens) భూమిపై దాడి చేయబోతున్నారని కొందరు.. గ్రహాలు ఢీకొట్టి శకలాలు కిందపడబోతున్నాయని ఇంకొందరు.. భూమి ఇక ఎండ్ అయిపోతుందని మరికొందరు.. ఇలా తమకు ఇష్టమొచ్చిన కథలు అల్లేశారు. చాలామంది ఇక తమ లైఫ్ ఎండ్ అనుకుని ఇష్టమైన వంటలు చేసుకుని తిన్నారు. ఆప్తులతో ఫోన్లలో మాట్లాడుకున్నారు. మధుర స్మృతులు నెమరువేసుకున్నారు. బావోద్వేగంతో Bye.. Bye చెప్పుకున్నారు. కానీ అక్కడ అంత సీన్ ఏమీ లేదు. ఆకాశం గులాబీ వర్ణంలోకి మారడానికి కారణం గంజాయి తోట. అవును దీని వెనుక ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ ఉందండోయ్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియా(Australia)లోని నార్తరన్ విక్టోరియాలో మిల్డురా పట్టణంలో ఈ ఘటన జరిగింది. అక్కడ ప్రభుత్వమే 2016 నుంచి గంజాయి పెంచుతుంది. అయితే అది వైద్యపరమైన అవసరాల కోసమే. ఈ క్రమంలోనే సేఫ్టీ కోసం గంజాయి తోటలు ఉండే ప్రాంతాలను చాలా రహస్యంగా ఉంచుతారు. ఇందుకోసం ప్రత్యేక ఏజెన్సీలు పని చేస్తాయి. ఆ చుట్టుపక్కన ఉండే స్థానికులకు కూడా అక్కడ తోటల ఉన్న విషయం తెలీదు. అంత గోప్యత పాటిస్తారు.

ఇక గంజాయి పంట బాగా పండేందుకు ఎరుపు గులాబి వర్ణంలో ఉండే కాంతిని వినియోగిస్తారు. అందుకు సంబంధించిన లైట్లను మొక్కల మధ్య సెట్ చేస్తారు. అయితే రాత్రి సమయాల్లో ఈ లైట్లు వేసినప్పుడు చుట్టుపక్కల వాళ్లకు తెలియకుండా ఉండేందుకు మొక్కలను పెంచే ఎన్‌క్లోజర్స్‌ను నల్లని తెరలతో మూసేస్తారు. మళ్లీ ఉదయాన్నే వాటిని రిమూవ్ చేస్తారు. కాగా మిల్డురాలో ఓ సాంకేతిక లోపం జరిగింది. కాన్ గ్రూప్‌కు చెందిన తోటలో మొక్కల ఎన్‌క్లోజర్స్ మీద నల్లటి తెరలను కప్పే వ్యవస్థ మొరాయించింది. దీంతో ఊహించని దృశ్యం ఆవిష్కృతమైంది. లైట్ల కారణంగా కొన్ని ఎకరాల్లోని గంజాయి తోటలు ఉన్న ప్రాంతంలోని ఆకాశమంతా గులాబీ మయం అయ్యింది. కాంతి ఘాడత బాగా పెరగడానికి మరో రీజన్ కూడా ఉంది. ఆ రోజు ఆ ఏరియాలో బాగా మబ్బులు కమ్మాయి. దాంతో ఆ మబ్బుల మీద పడిన కాంతి రిఫ్లెక్ట్ అవడం వల్ల కాంతి ఘాడత మరింత పెరిగింది. దాన్ని చూసే అక్కడి ప్రజలు తెగ టెన్షన్ పడ్డారు. చివరకు ప్రభుత్వ వర్గాలు వివరణ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..