Woman Video: పట్టపగలు నడిరోడ్డుపై .. కామాంధుడి లైంగిక వేధింపులు..! దానిపై చర్చకు దారితీసిన వైరల్ వీడియో..
మహిళలపై వేధింపులు ఇంటా బయటా పెరిగిపోయాయి. అందునా ప్రత్యేకించి ఒంటరి మహిళలే టార్గెట్‌గా దుండగులు రెచ్చిపోతున్నారు. కఠిన చట్టాలు, త్వరగతిన చర్యలు తీసుకోనంత
మహిళలపై వేధింపులు ఇంటా బయటా పెరిగిపోయాయి. అందునా ప్రత్యేకించి ఒంటరి మహిళలే టార్గెట్‌గా దుండగులు రెచ్చిపోతున్నారు. కఠిన చట్టాలు, త్వరగతిన చర్యలు తీసుకోనంత వరకు పరిస్థితిలో మార్పు వచ్చేలా కనిపించడం లేదు. తాజాగా.. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ షాకింగ్ ఘటన సీసీ ఫుటేజీ ద్వారా బయటకు వచ్చింది. వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు ఓ దుండగుడు. వెనుక నుంచి వెళ్లి ఆమెను పట్టుకుని.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విడిపించుకునేందుకు బాధితురాలు ప్రతిఘటించినా లాభం లేకపోయింది. వేధించిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు దుండగుడు. పాక్ సీనియర్ జర్నలిస్ట్ హమీద్ మీర్ ట్విటర్‌లో వీడియోను పోస్ట్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించి.. ఇలాంటి వాళ్లకు గుణపాఠం చెప్పాలని కోరారు. ఒంటరిగా వెళ్తున్న ఆమెను దుండగుడు ఫాలో అవుతున్నట్లు అంతకు ముందు వీధిలో ఉన్న సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. అయితే ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. అయినా సోషల్ మీడియా విమర్శలతో ఫిర్యాదు స్వీకరించామని స్థానిక పోలీసులు వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..