AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఒంటిని విల్లులా మార్చేసింది.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..

ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈ అమ్మడుకు ఓ పాప కూడా ఉంది. అంతేకాకుండా..

Viral Photo: ఒంటిని విల్లులా మార్చేసింది.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..
Viral
Rajitha Chanti
|

Updated on: Jul 23, 2022 | 12:14 PM

Share

హీరోయిన్ అంటే అందమే కాదు.. ఆహార్యం కూడా ముఖ్యమే. అందుకే నటీనటులంతా ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ద వహిస్తారు. మెడిటేషన్, యోగ, వర్కవుట్స్ చేస్తూ ఫిట్ గా ఉంటారు. ఇక తారలు ఎక్కువగా జిమ్‏లో ఎంతో కష్టపడి వర్కవుట్ చేస్తున్న వీడియోస్.. ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి కదా. తాజాగా యోగా చేస్తూ తన ఒంటిని ఏకంగా విల్లులా మార్చేసింది ఓ హీరోయిన్. ఆమెకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పైన ఫోటో చూశారు కదా. అమాంతం విల్లులా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి.

ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈ అమ్మడుకు ఓ పాప కూడా ఉంది. అంతేకాకుండా.. ఈ ముద్దుగుమ్మ భర్త మరో ఫేమస్ సెలబ్రెటీ. గుర్తుపట్టండి.

కష్టమైన ఆసనాలను అలవోకగా వేస్తున్న ఈ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ. రబ్ నే బనాదీ జోడీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. టీమిండియా కెప్టెన్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమ వివాహం చేసుకుంది అనుష్క. వీరిద్దరికి వామిక అనే పాప కూడా ఉంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us