Telugu News Telangana Telangana Governor Tamilisai Soundararajan treats a patient in distress on board a flight
Tamilisai Soundararajan: మంచి మనసున్న మన గవర్నర్.. విమానంలో ఛాతీ నొప్పి బాధితుడికి అత్యవసర చికిత్స చేసి..
Telangana Governor Tamilisai : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. తను ప్రయాణిస్తున్న విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన వ్యక్తికి అత్యవసర చికిత్స అందించి అందరి మన్ననలు అందుకున్నారు.
Telangana Governor Tamilisai : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. తను ప్రయాణిస్తున్న విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన వ్యక్తికి అత్యవసర చికిత్స అందించి అందరి మన్ననలు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే వ్యక్తిగత పనుల నిమిత్తం వారణాసి వెళ్లిన గవర్నర్ శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీ- హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్‌లో తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ సమయంలో తోటి ప్రయాణికుల్లో ఒకరు ఛాతీ నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన విమాన సిబ్బంది.. ప్రయాణికుల్లో ఎవరైనా డాక్టర్లున్నారా? అని అడిగారు. దీంతో తమిళిసై వెంటనే స్పందించారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న వ్యక్తికి అత్యవసర చికిత్స అందించారు. తద్వారా సమస్య మరింత తీవ్రతరం కాకుండా ఉపశమనం కలిగించారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. ఈ సందర్భంగా సదరు బాధితుడితో పాటు తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది తెలంగాణ గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
[23/07, 06:24] Dr Soundararajan: There was a panic call from air hostess while the flight was in mid air..Is there any Doctor in this flight?
[23/07, 06:29] Dr Soundararajan: Got up to rush to the rear to see a passenger looking drowsy sweating profusely C/o indigestion symptoms?
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) July 23, 2022
ఆ అనుభవంతోనే..
కాగా తమిళి సై వైద్య విద్యను అభ్యసించారు. చెన్నైలోని మద్రాస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆతర్వాత డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ విశ్వవిద్యాలయం నుంచి ప్రసూతి ( obstetrics), గైనకాలజీ విభాగాల్లో పట్టా పొందారు. ఆపై కెనడా వెళ్లి సోనాలజీ, FET థెరపీలో శిక్షణ తీసుకున్నారు. ఇక ఆమె భర్త సౌందరరాజన్ తమిళనాడులో ప్రముఖ వైద్యుడిగా పేరు పొందారు. అదేవిధంగా భారత వైద్య పరిశోధన మండలి (ICMR) పాలక మండలి సభ్యులు. ఈ అనుభవంతోనే తోటి ప్రయాణికుడికి సత్వర చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు తమిళిసై. కాగా సరైన సమయంలో స్పందించి ప్రయాణికుల రక్షణగా నిలిచిన విమాన సిబ్బందిని తమిళిసై అభినందించారు. ‘విమానంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. అదేవిధంగా విమాన ప్రయాణాల్లో డాక్టర్లు ఎవరైనా ఉంటే ముందే వారి వివరాలను అందుబాటులో ఉంచేలా ఒక కొత్త విధానం ఉండాలి. అదేవిధంగా విమాన సిబ్బందికి సీపీఆర్‌పై కనీస అవగాహన ఉండేలా ట్రైనింగ్ ఇవ్వాలి. వారితో పాటు సామాన్యులు కూడా సీపీఆర్‌పై అవగాహన పెంచుకుంటే ఆపద సమయంలో ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు గవర్నరమ్మ.
Today Pondicherry Governor @DrTamilisaiGuv treated a patient who fell ill on Air on Delhi-Hyd bound flight in @IndiGo6E
Governor responded to panic call from air hostess while the flight was in mid air at 6.24am.Treated with FIRST AID & supportive drugs.
Kudos to Tamilisai Madam pic.twitter.com/rZPnH4Iyna
Mr Mudavath, it was our absolute pleasure to have @DrTamilisaiGuv onboard with us. We salute our superheroes and can’t thank them enough for their selfless contribution always.? https://t.co/CEAN6jpwHI