TSPSC Recruitment 2022: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..జీతం లక్షకు పైనే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్.. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (Food Safety Officer Posts) పోస్టుల భర్తీకి..
TSPSC Food Safety Officer Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్.. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (Food Safety Officer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు
వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.42,300ల నుంచి రూ.1,15,270ల వరకు చెల్లిస్తారు.
అర్హతలు: ఫుడ్ టెక్నాలజీ/డెయిరీ టెక్నాలజీ/బయోటెక్నాలజీ/ఆయిల్ టెక్నాలజీ/అగ్రికల్చరల్ సైన్స్/వెటర్నరీ సైన్సెస్/బయో కెమిస్ట్రీ/మైక్రోబయాలజీ విభాగాల్లో బీఎస్సీ లేదా కెమిస్ట్రీలో పీజీ లేదా మెడిసిన్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: రూ.280
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 29, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 26, 2022.
రాత పరీక్ష తేదీ: నవంబర్, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
వివరణాత్మక నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.