Jaishankar: శ్రీలంకను చూసి అప్రమత్తం కాకపోతే మనకీ ఇదే పరిస్థితి.. కేంద్రం హెచ్చరికలు!

శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. మునుముందు మన దేశంలో కూడా ఈ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి (ఈఏఎం) ఎస్ జైశంకర్ నేతృత్వంలో మంగళవారం (జులై 19) కేంద్ర ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో..

Jaishankar: శ్రీలంకను చూసి అప్రమత్తం కాకపోతే మనకీ ఇదే పరిస్థితి.. కేంద్రం హెచ్చరికలు!
S Jaishankar
Follow us

|

Updated on: Jul 20, 2022 | 11:16 AM

Is india Going to face economic crisis: శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. మునుముందు మన దేశంలో కూడా ఈ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి (ఈఏఎం) ఎస్ జైశంకర్ నేతృత్వంలో మంగళవారం (జులై 19) కేంద్ర ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో హెచ్చరించారు. ఈ సమావేశానికి కేంద్ర, రాష్ట్రాల్లోని అన్నీ పార్టీలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ ప్రజెంటేషన్‌లో శ్రీలంక ఆర్థిక పరిస్థితులు పతనమవ్వడానికి గల కారణాలను జైశంకర్ వివరించి చెప్పారు.ఈ ప్రజెంటేషన్‌లో ఆయన ఈ విధంగా మాట్లాడారు. అఖిల పక్ష సమావేశంలో పాల్గొనమని అన్ని పార్టీల సభ్యులను అడగడం వెనుక కారణం ఏంటంటే.. శ్రీలంక మన పొరుగు దేశం కావడం వల్ల సహజంగానే ఆ దేశ ఆర్ధిక సంక్షోభం పర్యావసానాలపై మనలో ఆందోళన కలుగుతుంది. శ్రీలంకకు పట్టిన గతే మన దేశానికి కూడా పట్టనుంది. తీవ్రమైన విదేశీ మారకద్రవ్యం కొరత కారణంగా ఆహారం, పెట్రోల్‌, మెడిసిన్‌ వంటి అనేక నిత్యవసర వస్తువులు దిగుమతి చేసుకోలేని పరిస్థితికి దిగజారింది. అనాలోచిత ఆర్థిక నిర్ణయాల వల్ల అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అక్కడ మరోమారు ఎమర్జెన్సీ ప్రకటించాడు. ఇక అధ్యక్షుడైన గోటబయ రాజపక్స దేశం విడిచి సింగపూర్ పారిపోయిన తర్వాత ఈ మెయిల్ ద్వారా రాజీనామా సమర్పించాడు. శ్రీలంక పరిస్తితులను చూసి మనం కూడా అప్రమత్తంకావాలని జైశంకర్ హెచ్చిరించారు.

శ్రీలంక పరిస్థితులతోపాటు దేశంలోని ఆంధ్రప్రదేశ్‌తో సహా 10 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై కేంద్ర ఆర్థికశాఖ అధికారులు ప్రత్యేక పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాల స్థితిగతులనూ ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, హరియాణా, ఝార్ఖండ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రుణాలు జీఎస్‌డీపీలో 32%కి చేరగా, తెలంగాణ జీఎస్‌డీపీలో 25%కి చేరాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాలు రుణ, ఆర్థిక కొలమానాలను దాటినట్లు పేర్కొన్నారు. ఈ రాష్ట్రాలు తీసుకున్న బడ్జెటేతర రుణాలు, ఆదాయ- వ్యయాలు, వృద్ధి రేటు – అప్పుల మధ్య వ్యత్యాసం, ఆస్తుల తాకట్టు, డిస్కంలు, జెన్‌కోలకు చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్రాలు ఇచ్చిన గ్యారెంటీల వంటి అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించి అప్రమత్తం చేశారు. ఐతే కొందరు శ్రీలంక పరిస్థితుల గురించి వివరించడానికి పిలిచి రాష్ట్రాల అప్పుల గురించి చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అప్పులపై ఇస్తు్న్న ప్రజెంటేషన్‌ ఆపివేసి, శ్రీలంకకు భారత్‌ అందిస్తున్న సాయం, అక్కడి పరిస్థితుల గురించి తిరిగి ఆర్థిక శాఖ అధికారులు మాట్లాడటం ప్రారంభించారు.