AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs PBKS: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన గుజరాత్.. పంజాబ్ ఖాతాలో తొలి విజయం

ఐపీఎల్-18 5వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ (GT) సొంత మైదానలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. పంజాబ్ కింగ్స్ అందించిన 244 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 232 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 11 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

GT vs PBKS: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన గుజరాత్.. పంజాబ్ ఖాతాలో తొలి విజయం
Shreyas Iyer Vs Prasidh Krishna (5)
Venkata Chari
|

Updated on: Mar 25, 2025 | 11:23 PM

Share

ఐపీఎల్-18 5వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ (GT) సొంత మైదానలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. పంజాబ్ కింగ్స్ అందించిన 244 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 232 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 11 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. ఇది పంజాబ్‌కు రెండో అత్యధిక స్కోరు.

గుజరాత్ తరపున రూథర్ ఫోర్డ్ 46, జోస్ బట్లర్ 54 పరుగులు చేసి ఔటయ్యాడు. బట్లర్ మార్కో జాన్సన్ బౌలింగ్‌లో బౌల్డ్ అవ్వగా, రూథర్ ఫోర్డ్ అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. సాయి సుదర్శన్ (74 పరుగులు) అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (33 పరుగులు)ను గ్లెన్ మాక్స్‌వెల్ పెవిలియన్‌కు పంపాడు.

చివరి 6 ఓవర్లలో పంజాబ్ 104 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 97 పరుగులతో, శశాంక్ సింగ్ 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇద్దరి మధ్య 81 పరుగుల అజేయ భాగస్వామ్యం ఉంది. ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 47 పరుగులు చేశాడు. గుజరాత్ నుంచి సాయి కిషోర్ 3 వికెట్లు పడగొట్టాడు. కగిసో రబాడ, రషీద్ ఖాన్ లకు తలా ఒక వికెట్ దక్కింది.

రెండు జట్ల ప్లేయింగ్-11..

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, ఆర్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్ మరియు ప్రసిద్ధ్ కృష్ణ.

ఇంపాక్ట్ ప్లేయర్స్: షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, ఇషాంత్ శర్మ, అనుజ్ రావత్ మరియు వాషింగ్టన్ సుందర్.

పంజాబ్ కింగ్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాంష్ షెడ్జ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్ మరియు యుజ్వేంద్ర చాహల్.

ఇంపాక్ట్ ప్లేయర్: హర్‌ప్రీత్ బ్రార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..