Mohammed Siraj: కనిపించడు కానీ.. మంచి కళాకారుడే! సిరాజ్ ఇష్టపడిన ఈ అమ్మాయి ఎవరు?
టీమిండియా క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ లిబియాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హనీన్ హమందోష్ ఫోటోకు ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య డేటింగ్ ఉందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. హనీన్ దుబాయ్‌లో నివసిస్తున్నారు 6,50,000 మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. సిరాజ్ ప్రస్తుతం IPLలో బిజీగా ఉన్నాడు.

టీమిండియా క్రికెటర్, మన హైదరాబాదీ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ గురించి తెలిసిందే.. ఇండియన్ టీమ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ప్రస్తుతం ఫోకస్ మొత్తం క్రికెట్‌పైనే ఉన్నా.. త్వరలోనే ఓ ఇంటివాడు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక మంచి అమ్మాయిని చూసి.. మనోడికి నిఖా చేసేయాలని ఇంట్లో వాళ్లు కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ లోపే సిరాజ్ భాయ్ ఓ అమ్మాయిని ఇష్టపడినట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయి సాధారణ అమ్మాయి కాదు.. వరల్డ్ వైడ్‌గా గుర్తింపు ఉన్న గ్లామర్ గర్ల్. సిరాజ్ ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్నాడు మియా భాయ్.
అయితే.. రిసెంట్‌గా సిరాజ్ ఓ అమ్మాయి ఫోటోకు ఇన్‌స్టాగ్రామ్‌కు లైక్ కొట్టాడు. సాధారణంగా క్రికెటర్లు ఏ చిన్న పని చేసినా.. అది హైలెట్ అయిపోతుంది, నెటిజన్ల దృష్టిని ఇట్టే ఆకర్షించేస్తుంది. ఇప్పుడు సిరాజ్ ఓ అందమైన అమ్మాయి ఫొటోకు లైక్ చేయడం కూడా వైరల్‌గా మారింది. ఇంతకీ సిరాజ్ లైక్ చేసిన ఆ అమ్మాయి ఎవరంటే.. ఆమె పేరు హనీన్ హమందోష్. ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. లిబియాకు చెందిన అమ్మాయి. బ్రెజిల్‌లో కూడా చాలా కాలం నివశించింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటోంది. కంటెంట్ క్రియేటర్‌గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. మన హీరోయిన్లు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండేందుకు ఇన్‌స్టాలో ఎలాగైతే ఫొటోలు పెడుతుంటారో.. తన కూడా అలానే అందమైన ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
ఇన్‌స్టాలో ఆమెకు ఏకంగా 650 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఓ 8 మందిని మాత్రమే ఫాలో అవుతుంది. తాజాగా ఆమె పెట్టిన ఫొటోలకు సిరాజ్ లైక్ కొట్టడం ఇక్కడ ఆసక్తిగా మారింది. పెళ్లీడుకి వచ్చిన కుర్రాడు.. పాపం ఫొటో చూడగానే పడిపోయాడమే అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. వేరే దేశాల అమ్మాయిలను, బాలీవుడ్ బ్యాటీలను, మోడల్స్‌ను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను మన క్రికెటర్లు పెళ్లి చేసుకోవడం కొత్తేమి కాదు. మరి వారిలో బాటలోనే సిరాజ్ కూడా నడుస్తాడో లేదో చూడాలి.
mohammed Siraj liked haneen hamandosh instagram post #siraj #haneen pic.twitter.com/4tZYO1LQC3
— Sayyad Nag Pasha (@nag_pasha) March 26, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.