Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: జీటీపై పంజాబ్‌ కింగ్స్ గెలుపు! ఏడుస్తున్న ఆర్సీబీ అభిమానులు! ఇదెక్కడి గోల రా స్వామి

పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 సీజన్‌ను గుజరాత్ టైటాన్స్‌పై విజయంతో ప్రారంభించింది. శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన 97 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, విజయ్ కుమార్ వైశాఖ్ అద్భుతమైన బౌలింగ్‌తో గుజరాత్‌ను 11 పరుగుల తేడాతో ఓడించాడు. వైశాఖ్ ప్రభావవంతమైన ఇంపాక్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. పంజాబ్ 243 పరుగుల భారీ స్కోరు సాధించింది.

IPL 2025: జీటీపై పంజాబ్‌ కింగ్స్ గెలుపు! ఏడుస్తున్న ఆర్సీబీ అభిమానులు! ఇదెక్కడి గోల రా స్వామి
Pbks Vs Gt
Follow us
SN Pasha

|

Updated on: Mar 26, 2025 | 9:03 AM

ఐపీఎల్‌ 2025లో పంజాబ్‌ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. శుబ్‌మన్ గిల్‌ కెప్టెన్సీలోని గుజరాత్‌ టైటాన్స్‌ను వాళ్ల సొంత గ్రౌండ్‌లో ఓడించి.. ఈ 18వ సీజన్‌ను విజయంతో మొదలుపెట్టింది. పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 42 బంతుల్లోనే 5 ఫోర్లు, 9 సిక్సులతో 97 పరుగుల స్మాషింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరంభంలోనే ప్రభ్‌సిమ్రాన్‌ వికెట్‌క కోల్పో్యినా.. ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్యతో కలిసి అయ్యర్‌ స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టించాడు. చివర్లో శశాంక్‌ సింగ్‌ 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 44 పరుగులు చేసి విధ్వంసకర విన్నింగ్స్‌ ఆడాడు. మొత్తంగా పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 243 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అలాగే గుజరాత్‌ టైటాన్స్‌ సైతం అద్బుతంగా పోరాడింది.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసి.. విజయానికి కేవలం 11 పరుగుల దూరంలో నిలిచింది.

అయితే.. గుజరాత్‌కు ఈ మ్యాచ్‌ దూరం చేసింది, పంజాబ్‌ను గెలిపించింది మాత్రమ.. ఒక ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌. పంజాబ్‌ తరఫున ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా ఆడిన విజయ్‌ కుమార్‌ వైశాక్‌. ఇన్నింగ్స్‌ 15 ఓవర్‌ వేసిన వైశాఖ్‌ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత 17వ ఓవర్‌లోనూ మళ్లీ 5 రన్స్‌ మాత్రమే ఇచ్చాడు. ఈ రెండు ఓవర్లు గుజరాత్‌ టైటాన్స్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచడమే కాకుండా.. రిక్వైర్డ్‌ రన్‌రేట్‌ను అమాంతం పెంచేసింది. ఫీల్డింగ్‌ తగ్గట్లు.. అన్నీ అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ వైడ్‌ యార్కర్లు వేస్తూ.. రూథర్‌ఫోర్డ్‌, బట్లర్‌కు అస్సలు ఛాన్స్‌ ఇవ్వకుండా.. గుజరాత్‌ వైపు ఉన్న మ్యాచ్‌ను పంజాబ్‌ వైపు తిప్పేశాడు. విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌ వేసిన ఈ బౌలింగ్‌ చూసి.. అంత ఆశ్చర్యపోయారు. శభాష్‌ అంటూ మెచ్చుకున్నారు.

కానీ, ఒక్క ఆర్సీబీ అభిమానులు మాత్రం.. అయ్యో ఎంత పని అయిపోయిందే అంటూ బాధపడ్డారు. ఎందుకంటే.. లాస్ట్‌ సీజన్‌లో వైశాఖ్‌ ఆర్సీబీ తరఫున ఆడాడు. అతన్ని వాళ్లు రీటెన్‌ చేసుకోలేదు. పంజాబ్‌ వేలంలో తీసుకుంది. ఈ సీజన్‌లో ఫస్ట్‌ మ్యాచ్‌లో ఇంత ప్రెజర్‌లో ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన అతను బౌలింగ్‌ వేసిన విధానం చూసి.. ఛా మరో ప్లేయర్‌ను మిస్‌ అయ్యాం అంటూ ఫీల్‌ అయ్యారు. అయినా ఆర్సీబీ నుంచి బయటికి వస్తే.. ప్లేయర్లు సక్సెస్‌ అవుతారనే సరదాగా సెంటిమెంట్‌ కూడా క్రికెట్‌ ఫ్యాన్స్‌లో ఉంది. అదే వైశాఖ్‌ విషయంలోనూ పని చేసిందని అంటున్నారు. కానీ, సిరాజ్‌ విషయంలో మాత్రం అది పనిచేయలేదు. నిన్నటి మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు సిరాజ్‌.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.