AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: IPLలో ఆ రూల్‌ అవసరం లేదు.. ధోని షాకింగ్‌ కామెంట్స్‌! నేను అలాంటి ప్లేయర్‌ను కాదంటూ..

ఐపీఎల్ లోని కొత్త ఇంపాక్ట్ ప్లేయర్ నియమం గురించి మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రారంభంలో ఈ నియమం అవసరం లేదని భావించినప్పటికీ, ఇది ఆటలో పెను మార్పులు తీసుకొచ్చిందని అంగీకరించాడు. ఈ నియమం వల్ల అధిక స్కోర్లు నమోదు అవుతున్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నప్పటికీ, ధోని ఆటగాళ్ళ ఆక్రమణాత్మకతే దానికి కారణమని అభిప్రాయపడ్డాడు.

MS Dhoni: IPLలో ఆ రూల్‌ అవసరం లేదు.. ధోని షాకింగ్‌ కామెంట్స్‌! నేను అలాంటి ప్లేయర్‌ను కాదంటూ..
Ms Dhoni
SN Pasha
|

Updated on: Mar 26, 2025 | 8:43 AM

Share

ఐపీఎల్‌ 2025లో చెన్నై సూపర్‌ కింగ్స్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 28న ఆర్సీబీతో తమ రెండో మ్యాచ్‌ ఆడనుంది సీఎస్‌కే. ఈ నేపథ్యంలో ఆ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో ఆ రూల్‌ అసవరం లేదని తాను అనుకున్నానని అన్నాడు. కానీ ఆ రూల్‌ వల్లే ఐపీఎల్‌లో పెను మార్పు సంభవించింది. ఇంతకీ ఐపీఎల్‌లో ధోని వద్దనుకున్న ఓ రూల్‌ ఏంటంటే.. ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌. సెకండ్‌ బ్యాటింగ్‌ చేసే టైమ్‌లో బ్యాటర్‌ను, బౌలింగ్‌ చేస్తుంటే బౌలర్‌ను చాలా టీమ్స్‌ ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ను ఆడిస్తున్నాయి. ఈ రూల్‌ ఆటపై చాలా ఇంప్యాక్ట్‌ చూపిస్తోంది.

మంగళవారం సోమవారం జరిగిన లక్నో వర్సెస్‌ ఢిల్లీ మ్యాచ్‌లో ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన అశుతోష్‌ శర్మ అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడి ఢిల్లీని గెలిపించాడు, మంగళవారం గుజరాత్‌ వర్సెస్‌ పంజాబ్‌ మ్యాచ్‌లో ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చి అద్బుతమైన బౌలింగ్‌తో విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌ పంజాబ్‌ను గెలిపించాడు. ఇలా ఈ ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ చాలా ప్రభావం చూపుతోంది. అయితే.. ఈ రూల్‌ను ఫస్ట్‌ టైమ్‌ ఐపీఎల్‌లో ప్రవేశ పెట్టేముందు తాను అవసరం లేదని అనుకున్నాని, కానీ, కొన్ని సార్లు తనకు ఉపయోగపడుతుందని అన్నాడు. అలా అని తాను ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ కానీ, ఎందుకంటే తాను కీపింగ్‌ చేస్తాను, గేమ్‌లో నా ఇన్వాల్‌మెంట్‌ ఉంటుంది అని ధోని పేర్కొన్నాడు. అయితే ఈ ఇంప్యాక్ట్‌

ప్లేయర్‌ కారణంగా ఐపీఎల్‌లో భారీ భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రూపంలో ఎక్స్‌ట్రా బ్యాటర్‌ లభిస్తుండటంతో ముందుగా బ్యాటింగ్‌కి వచ్చే ప్లేయర్‌ చాలా ఫియర్‌లెస్‌గా ఆడుతున్నారని అందుకే పెద్ద స్కోర్లు వస్తున్నాయని చాలా మంది అన్నారు. కానీ, ధోని మాత్రం ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ వల్లే భారీ స్కోర్లు నమోదు కావడం లేదని, ఆటగాళ్ల మైండ్‌ సెట్‌, అగ్రెసివ్‌ ఎటాకింగ్‌ గేమ్‌ కారణంగా వస్తున్నాయని అన్నాడు. కాగా, ఈ ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ను తీసేయని గతంలో చాలా మంది క్రికెటర్లు బహిరంగంగానే బీసీసీఐని కోరిన విషయం తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.