కటింగ్ చేస్తే లక్షలే..! ఓవర్ ఆల్ సంపాదన కోట్లలోనే
ఆలీమ్ హకీమ్.. ప్రస్తుతం ఇండియాలోనే ది మోస్ట్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్. ఈయన కస్టమర్లంతా ఫేమస్ సెలబ్రిటీలే. అందులోనూ సినీ, క్రీడా ప్రముఖులే హకీమ్ దగ్గరకు ఎక్కువగా వస్తుంటారు. అయితే ఇతను మొదట హాలీవుడ్ హెయిర్‌స్టర్. మొదట్లో ఒకరికి హెయిర్ కట్ చేస్తే జస్ట్ రూ. 20 మాత్రమే తీసుకునే వారట.
అయితే ఆ తర్వాత తన పనితనం బాగుండడంతో రోజు రోజుకీ కస్టమర్లు పెరిగిపోయారట. సెలబ్రిటీలు కూడా హకీమ్ దగ్గరకు క్యూ కట్టేవారట. దీంతో ఆయన కూడా తన హెయిర్ కట్ ఫీజులు అంచెలంచెలుగా పెంచుకుంటూ పోయాడట. ఇప్పుడు సెలబ్రిటీలకు స్టైలింగ్ చేస్తూ లక్షలు.. కోట్లలో సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం ఆలీమ్ హకీమ్ ఒక్కో హెయిర్ కటింగ్ కు మినిమమ్ లక్ష రూపాయలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. ఇది కూడా మినిమమ్ ధర మాత్రమేనట.. అత్యధికంగా ఆయన రూ.2.5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని సమాచారం. ఇక సెలబ్రిటీతో పాటు పలు సినిమాలకు కూడా అకీమ్ హెయిర్ స్టైలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ కూలి సినిమాకు ఆయన వర్క్ చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ ఆర్ సీ 16 మూవీకి కూడా హెయిర్ స్టైలిస్ట్ గా వ్యవహరిస్తున్నారు. వీటితో పాటు బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలోని పలు క్రేజీ ప్రాజెక్టులకు హకీమ్ హెయిర్ స్టర్ గా పని చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంచి మనసు చాటుకున్న పవన్ కూతురు !! మురిసిపోయిన రేణు !!
పచ్చి ఉల్లి తినే అలవాటు ఉందా ?? ఇది మీకోసమే !!
గ్రహాంతరవాసులు ఉన్నారా ?? ఏలియన్స్ జాడ అమెరికాకు తెలుసా ??