Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు తగ్గే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

మార్చి 26, 2025 నాటికి అన్ని 12 రాశుల వారికి దినఫలాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. మేషం నుండి మీనం వరకు ప్రతి రాశికి ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థికం, ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టితో దినఫలాలు ఇవ్వబడ్డాయి. శుభవార్తలు, సవాళ్లు మరియు జాగ్రత్తలు వంటి ముఖ్య అంశాలను ఈ జ్యోతిష్య ఫలాలు వివరిస్తాయి. మీ రాశి ఫలాన్ని చదవండి మరియు మీ రోజును సంతృప్తికరంగా గడపండి.

Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు తగ్గే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 26th March 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 26, 2025 | 5:01 AM

దిన ఫలాలు (మార్చి 26, 2025): మేష రాశి వారికి అదనపు ఆదాయ మార్గాలు మరింతగా పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనుకోకుండా ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు, అవసరాల ఒత్తిడి తగ్గుతుంది. మిథున రాశి వారికి ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులకు బాగా నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్నవి అనుకున్నట్టు జరిగిపోతాయి. కుటుంబంలో ఒక ముఖ్యమైన శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. అదనపు ఆదాయ మార్గాలు మరింతగా పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగులకు అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, పనులు నిదానంగా పూర్తవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరగడంతో పాటు ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనుకోకుండా ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు, అవసరాల ఒత్తిడి తగ్గుతుంది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయం పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృథా ఖర్చుల్ని అదుపు చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు తక్కువ శ్రమతో విజయాలు సాధిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఇంటా బయటా పని భారం, పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. తలపెట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శన చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. విద్యార్థుల మీద ఒత్తిడి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానేఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. లాభాలపరంగా వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. ప్రతి పనీ నిదానంగా సాగుతుంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆర్థికంగా కొద్దిపాటి అనుకూలతలుంటాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. బంధువుల విషయాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలువింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్య సమస్యలు బాగా తగ్గుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. సమయం అనుకూలంగా ఉన్నందువల్ల మంచి కార్యక్రమాలను, ప్రయత్నాలను చేపట్టడం మంచిది. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. విద్యార్థులకు బాగుంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలుంటాయి. రావలసిన సొమ్ము చేతికి అందక ఇబ్బంది పడతారు. ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి అడుగువేయడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు, హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సకాలంలో, సంతృప్తికరంగా ముగుస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ఆస్తి వివాదంలో రాజీమార్గం అనుసరించే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

పదోన్నతి, జీతభత్యాల విషయంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గట్టుగా లాభాలు గడించడం జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు కొద్ది శ్రమతో పురోగతి సాధిస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలను చాలా వరకు చక్కబెడతారు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. సహోద్యోగులకు సహకారం అందజేస్తారు. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు కలుగుతాయి. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. బంధు వులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వచ్చే సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ తక్కువగా, ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. అధికారులకు మీ పనితీరు నచ్చుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.

ఆ ట్రెండ్‌ను పట్టుకున్న వరుణ్ తేజ్‌.. మరి ఇలాగైనా సక్సెస్ అవుతారా
ఆ ట్రెండ్‌ను పట్టుకున్న వరుణ్ తేజ్‌.. మరి ఇలాగైనా సక్సెస్ అవుతారా
హీరో నితిన్‌కు క్షమాపణలు చెప్పిన ఆది పినిశెట్టి.. ఏం జరిగిందంటే?
హీరో నితిన్‌కు క్షమాపణలు చెప్పిన ఆది పినిశెట్టి.. ఏం జరిగిందంటే?
దిమ్మతిరిగే న్యూస్ ! ఫ్యాన్స్‌కు చరణ్‌ బిగ్ సర్‌ప్రైజ్
దిమ్మతిరిగే న్యూస్ ! ఫ్యాన్స్‌కు చరణ్‌ బిగ్ సర్‌ప్రైజ్
టికెట్లు కావాల్సిన వారు పూర్తి వివ‌రాల‌తో మెయిల్ పంపాల‌ని సూచ‌న‌
టికెట్లు కావాల్సిన వారు పూర్తి వివ‌రాల‌తో మెయిల్ పంపాల‌ని సూచ‌న‌
రూ.500 తెచ్చిన తంట.. ఏకంగా కిటికీ ఎక్కేసిన మహిళ
రూ.500 తెచ్చిన తంట.. ఏకంగా కిటికీ ఎక్కేసిన మహిళ
బార్లీ నీళ్లు తాగితే శరీరానికి చలువ చేయడమే కాదు..ఆడవాళ్లలో ఈసమస్య
బార్లీ నీళ్లు తాగితే శరీరానికి చలువ చేయడమే కాదు..ఆడవాళ్లలో ఈసమస్య
కొత్త కారులో రష్మిక షికారు.. ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
కొత్త కారులో రష్మిక షికారు.. ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
ట్రెండింగ్‌లో ఉన్న ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ట్రెండింగ్‌లో ఉన్న ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
గ్లామర్ డోస్ పెంచేసిన ముద్దుగుమ్మ..
గ్లామర్ డోస్ పెంచేసిన ముద్దుగుమ్మ..
చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్.. వరుస సినిమాలతో అమ్మడు జోరు..
చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్.. వరుస సినిమాలతో అమ్మడు జోరు..