మహా డిప్యూటీ సీఎం షిండేపై కామ్రా వ్యాఖ్యల వివాదం.. ఖార్ స్డూడియోను కూల్చేసిన BMC
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండేపై వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గదే లేదంటున్నాడు కమెడియన్ కునాల్ కామ్రా.. సెటైర్లకు కూడా ఓ హద్దు ఉంటుందని , కామ్రా అన్ని లిమిట్స్ దాటాడని షిండే మండిపడ్డారు. మరోవైపు కామ్రా కామెడీషోకు వేదికైన ఖార్ థియేటర్‌ను BMC అధికారులు కూల్చేశారు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కామ్రా చేసిన గద్దార్ వ్యాఖ్యల వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఈ వ్యాఖ్యలపై శివసేన షిండే వర్గం నేతలు మండిపడుతున్నారు. కునాల్ కామ్రా అంతుచూస్తామని హెచ్చరిస్తున్నారు. ముంబై లోని ఖార్ స్డూడియోపై ఆదివారం శివసేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ వ్యవహారంలో BMC అధికారులు కూడా రంగం లోకి దిగారు. అక్రమ నిర్మాణమని ఖార్ స్టూడియోను మున్సిపల్ అధికారులు కూల్చేశారు. షిండేపై తన వ్యాఖ్యలను గట్టిగా సమర్ధించుకుంటున్నారు కునాల్ కామ్రా.. షిండేపై గతంలో అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలనే తాను చేసినట్టు తెలిపారు.. ఖార్ స్టూడియోపై దాడి , తనకు బెదిరింపులకు వ్యతిరేకంగా ఓ పాటను విడుదల చేశారు కునాల్ కామ్రా.
ఇది చదవండి: సంతృప్తి కోసం ప్రైవేట్ పార్టులోకి.. నొప్పితో పరుగు పరుగున ఆస్పత్రికి.. ఎక్స్‌రే తీయగా
మరోవైపు కునాల్ కామ్రా వ్యవహారంపై స్పందించారు ఏక్‌నాథ్ షిండే.. సెటైర్లకు కూడా ఓ హద్దు ఉంటుందని , కామ్రా హద్దులు దాటారని మండిపడ్డారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎవరి దగ్గరో సుపారీ తీసుకొని ఇలా టార్గెట్ చేయడం తగదన్నారు. షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కునాల్ కామ్రాపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. అయితే వారం రోజుల తరువాత విచారణకు హాజరవుతానని పోలీసు సమన్లకు సమాధానమిచ్చారు కామ్రా. అయితే కునాల్ కామ్రాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు శివసేన ఉద్దవ్ వర్గం నేతలు.. వాస్తవాలు మాట్లాడితే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. కామ్రా పాడిన పాటను అసెంబ్లీలో ఉద్దవ్ వర్గం ఎమ్మెల్యేలు పాడారు. దీనిపై సీఎం ఫడ్నవీస్ మండిపడ్డారు. కామ్రాను కేవలం ఉద్దవ్ వర్గం నేతలే సమర్ధిస్తున్నారని అన్నారు. మరోవైపు ఖార్ స్టూడియో కూల్చివేతకు వ్యతిరేకంగా హాస్య ప్రేమికులు ఆందోళన చేపట్టారు. కూల్చివేతను నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఇది చదవండి: ఏపీ, తెలంగాణల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే.?
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..