RRB Railway Exam Dates 2025: ఆర్‌ఆర్‌బీ రైల్వే రాత పరీక్ష షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే
దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి ఇటీవల వరుస నోటిఫికేషన్లు జారీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల విడుదలైన సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ కూడా ముగియగా.. రాత పరీక్షల తేదీలను తాజాగా వెల్లడించింది..

హైదరాబాద్, డిసెంబర్ 28: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో సెక్షన్ కంట్రోలర్ పరీక్ష తేదీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో వచ్చ ఏడాది (2026) ఫిబ్రవరి 11, 12 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటనను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ మేరకు అభ్యర్ధులు తమ సన్నద్ధతను కొనసాగించాలని సూచించింది.
కాగా భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా గల అన్ని రైల్వే జోన్లలో మొత్తం 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది సెప్టెంబర్‌లో , రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB)నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిగ్రీ అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తికాగా.. ఆన్‌లైన్ రాత పరీక్షలు త్వరలోనే జరగనున్నాయి. రాత పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను రాత పరీక్షకు 4 రోజుల ముందు విడుదల చేస్తారు. రాత పరీక్ష అనంతరం కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అనంతరం మెరిట్ లిస్ట్ జారీ చేస్తారు. ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆర్‌ఆర్‌బీ సెక్షన్ కంట్రోలర్ పరీక్ష షెడ్యూల్ 2025 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




