Inter Public Exams 2026: ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరో 3 రోజులే గడువు! ఇదే చివరి ఛాన్స్..
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూర్తి టైం టేబుల్ ను కూడా ఇంటర్ బోర్డు విడుదల చేసింది. అయితే పరీక్షల ఫీజు చెల్లింపులకు సంబంధించి తాజాగా బోర్డు కీలక ప్రకటన జారీ చేసింది..

హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇంటర్ బోర్డు కీలక అప్‌డేట్ జారీ చేసింది. పరీక్షల ఫీజు చెల్లించడానికి మరో 3 రోజులే అవకాశం ఉంది. రూ.2 వేల ఆలస్య రుసుంతో డిసెంబరు 31వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు గడువు సమయం ముగింపులోగా ఫీజు చెల్లించాలని ఇంటర్‌బోర్డు తెలిపింది. కాగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు జరగనున్నాయి.
ఇంటర్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో రెండు నెలల ముందే విద్యార్ధుల తల్లిదండ్రుల వాట్సప్ నెంబర్‌కు వారి పిల్లల హాల్‌టికెట్లను నేరుగా పంపనుంది. హాల్‌టికెట్ నంబర్, పరీక్షా కేంద్రం వివరాలు, అలాగే ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుంది.. వంటి వివరాలు తెలుసుకోవచ్చు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్నారు. అలాగే ఈ సారి జరగబోయే పరీక్షలకు ప్రింటర్ నుంచి నేరుగా జిల్లా కేంద్రాలకే ఇంటర్ ప్రశ్నాపత్రాలను తరలించనున్నారు. లీకేజీలకు బ్రేక్ వేయడానికి ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రశ్నపత్రాలను తరలించే వాహనాలకు జీపీఎస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
తెలంగాణ టీజీఎఫ్‌ఎస్‌ఎల్ పోస్టులకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ తేదీలు విడుదల
తెలంగాణ ఫొరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (టీజీఎఫ్‌ఎస్‌ఎల్)లో ఉద్యోగాల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 60 సైంటిఫిక్ ఆఫీసర్లు, సైంటిఫిక్ అసిస్టెంట్లు, లాబోరేటరీ టెక్నీషియన్లు, లాబోరేటరీ అటెండెంట్ల పోస్టులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,500 మంది పురుషులు, 2165 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జనవరి 20 నుంచి 31 వరకు జరగనుంది. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరగనుంది. పరిశీలకు హాజరయ్యే అభ్యర్ధులు తమతోపాటు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లను, రెండు ఫొటోలను తీసుకువెళ్లాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాసరావు ఓప్రకటనలో తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




