AP Anganwadi Jobs 2025: పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హత కలిగిన మహిళా వివాహిత అభ్యర్ధుల నుంచి అంగన్వాడీలో ఉద్యోగాలకు జిల్లాలోని మహిళా శిశువు సంక్షేమం శాఖ కార్యాలయం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు ఉంది. ఆసక్తి కలిగిన వారు ఈ కింది అడ్రస్ లో దరఖాస్తులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలోని మహిళా శిశువు సంక్షేమం శాఖ కార్యాలయం (ICDS).. వివిధ గ్రామాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 69 అంగన్‌వాడీ వర్కర్, మినీ అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 30వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
సత్యసాయి జిల్లాలో అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతిలో తప్పనిసరిగా ఉత్తీర్ణత పొంది ఉండాలి. వివాహిత మహిళా అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే స్థానికులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అభ్యర్ధుల వయోపరిమితి జులై 1 2025 నాటికి 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లకు మించకూడదు. ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్ 30, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.
అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు కుల (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వముకు సంబందిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పొందిన పత్రాలను జతపరచాలి. అలాగే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి పదవ తరగతి పాసై ఉంటే, తప్పనిసరిగా టీసీ/స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి. స్క్ర్కూటినీ సమయములో CDPO ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి. CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్‌లో ఉత్తీర్ణత పొందాలి. ఎంపికైన వారికి నెలకు అంగన్‌వాడీ వర్కర్, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11,500. అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7,000 చొప్పున జీతంగా చెల్లిస్తారు.
అభ్యర్థులు స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో నింపిన దరఖాస్తులను అందజేయాలి. మరిన్ని వివరాల కొరకు సంబందిత సిడిపివో కార్యాలయం లేదా అనతపురము జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




