గుడ్ న్యూస్.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్
నిరుద్యోగులకు భారత రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా లెవల్-1 పోస్టుల భర్తీ కోసం సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. త్వరలో విడుదలయ్యే పూర్తి నోటిఫికేషన్‌కు ముందుగానే.. అవసరమైన సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని అభ్యర్థులకు సూచించింది. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏకంగా 22 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
నిరుద్యోగులకు భారత రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా లెవల్-1 పోస్టుల భర్తీ కోసం సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. త్వరలో విడుదలయ్యే పూర్తి నోటిఫికేషన్‌కు ముందుగానే.. అవసరమైన సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని అభ్యర్థులకు సూచించింది. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏకంగా 22 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం కల్పించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారుల వయసు కనీసం 18 సంవత్సరాలు నిండి, 36 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం ఆయా కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈబీసీ, మహిళా అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. 2026 జనవరి 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. పూర్తి సమాచారం కోసం అధికారిక పోర్టల్ ను సందర్శించాలని రైల్వే బోర్డు సూచించింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహిస్తారు. దరఖాస్తులు స్వీకరణ 2026 జనవరి 21 నుండి ప్రారంభమవుతుంది. చివరి తేదీ 2026 ఫిబ్రవరి 20 రాత్రి 11:59 గంటల వరకు ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత RRB అధికారిక వెబ్‌సైట్ లేదా www.rrbapply.gov.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్‌లైన్ లేదా ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేసింది. అలాగే ఈ ప్రకటన కేవలం ముందస్తు సమాచారం కోసం మాత్రమేనని.. నియామకానికి సంబంధించిన షరతులు, ఎంపిక విధానం, పరీక్ష విధానం, సిలబస్ వంటి అన్ని వివరాలు త్వరలో విడుదలయ్యే పూర్తి CEN నోటిఫికేషన్‌లో ఉంటాయని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది. అభ్యర్థులు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. సీబీటీలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ పూర్తయ్యాక అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విద్యుత్ స్తంభం ఎక్కిన ఎమ్మెల్యే.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి

