ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే.. 32 బంతుల్లో ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాక్.!
Chennai Super Kings: డెవాన్ కాన్వే ప్రదర్శన చూస్తుంటే, ఐపీఎల్ వేలంలో అతడిని వదులుకున్న జట్లు ఇప్పుడు కచ్చితంగా ఆలోచనలో పడతాయి. టోర్నీ మధ్యలో ఎవరైనా ఆటగాళ్లు గాయపడితే, రీప్లేస్‌మెంట్ రూపంలో కాన్వే మళ్లీ ఐపీఎల్‌లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Devon Conway: క్రికెట్‌లో ఫామ్ అనేది తాత్కాలికం, కానీ క్లాస్ అనేది శాశ్వతం అని న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే మరోసారి నిరూపించాడు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఏ ఫ్రాంచైజీ తనను కొనుగోలు చేయకపోవడంతో నిరాశ చెందిన కాన్వే, ఆ కసిని దక్షిణాఫ్రికాలో జరుగుతున్న SA20 లీగ్‌లో చూపించాడు. నాలుగో సీజన్ తొలి మ్యాచ్‌లోనే మెరుపు హాఫ్ సెంచరీతో విరుచుకుపడి తన విలువేంటో ప్రపంచానికి చాటిచెప్పాడు.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ ఓపెనర్ డెవాన్ కాన్వే తన బ్యాట్‌తో గర్జించాడు. కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా జరిగిన SA20 నాలుగో సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన కాన్వే, ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
33 బంతుల్లో 64 పరుగులు..
ఎంఐ కేప్ టౌన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కాన్వే, ఆది నుంచే దూకుడుగా ఆడాడు. కేవలం 26 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్న ఆయన, మొత్తం 33 బంతుల్లో 64 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇందులో 7 ఫోర్లు, 2 కళ్లు చెదిరే సిక్సర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 193.93గా నమోదైంది. కాన్వే ఇచ్చిన ఈ మెరుపు ఆరంభంతో డర్బన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 232 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఐపీఎల్ వేలం షాక్..
కొద్దిరోజుల క్రితం జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో కాన్వే రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగారు. గతంలో సీఎస్‌కే ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, ఈసారి ఏ జట్టు కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. గాయాలు, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో ఫామ్ లేమి కారణంగానే ఆయన అమ్ముడుపోలేదని విశ్లేషకులు భావించారు. అయితే, ఆ నిర్ణయం తప్పని కాన్వే తాజా ఇన్నింగ్స్‌తో నిరూపించాడు.
సీఎస్‌కేలో కాన్వే రికార్డు..
డెవాన్ కాన్వే ఐపీఎల్‌లో చెన్నై తరఫున మూడు సీజన్లు ఆడారు. 2023లో 672 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలవడంతో పాటు జట్టు టైటిల్ గెలవడంలో కీలకమయ్యాడు. ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 1,080 పరుగులు చేసిన కాన్వే, 43కి పైగా సగటును కలిగి ఉండటం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




