School Holidays: ఏపీ, తెలంగాణల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే.?
పరీక్షల కాలం ముగిసింది. సెలవుల కాలం వచ్చేసింది. ఏపీ, తెలంగాణలోని స్కూల్ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది సమ్మర్ హాలీడేస్ భారీగానే ఉండనున్నాయి. అయితే ఇంటర్ విద్యార్ధులకు మాత్రం హాలిడేస్ కాస్త కుదించారు. మరి ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం..

పరీక్షల కాలం ముగిసింది.. ఇక వేసవి సెలవులు వచ్చేస్తున్నాయ్. మొదట ఇంటర్.. ఆ తర్వాత టెన్త్ పరీక్షలు పూర్తి చేసిన విద్యార్ధులకు సూపర్ గుడ్ న్యూస్. ఈ ఏడాది వేసవి సెలవులు భారీగానే ఉండనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ 24న చివరి పనిదినం కాగా.. మరో మూడు రోజులు అనగా ఏప్రిల్ 27న ఫలితాలు ప్రకటించి.. స్కూల్స్‌కి వేసవి సెలవులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఏపీలోని పాఠశాలలకు ఏప్రిల్ 27 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు కాగా.. తిరిగి జూన్ 12న స్కూల్స్ రీ-ఓపెన్ కానున్నాయి. అటు తెలంగాణలోనూ పాఠశాలలకు భారీగానే వేసవి సెలవులు ఉండనున్నాయి. ఏప్రిల్ 27 నుంచి జూన్ 11 వరకు సెలవులు ఉండనున్నాయి. తిరిగి స్కూల్స్ జూన్ 12న తెరుచుకోనున్నాయి. గత సంవత్సరంలోనూ జూన్ నెలలో వడగాల్పులు విపరీతంగా ఉండటం వల్ల.. ఈ సెలవుల తేదీలు మారే అవకాశం లేకపోలేదు. అయితే వేసవి సెలవులపై ఒకట్రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
అటు ఏపీలో ఇంటర్ విద్యలో కీలక మార్పులు అమలు చేయనున్న కూటమి సర్కార్. దానికి అనుగుణంగా అకాడమిక్ క్యాలెండర్ సిద్దం చేసినట్టు సమాచారం. ఏటా జూన్ 1న ప్రారంభమయ్యే ఇంటర్ విద్యా సంవత్సరం ఈ ఏడాది ఏప్రిల్ 1న మొదలుకానుందని తెలుస్తోంది. ఏప్రిల్ 7 నుంచి అడ్మిషన్లు స్టార్ట్ చేసి ఏప్రిల్ 24 నుంచి క్లాసులు నిర్వహిస్తారట. ఆపై మే నెలాఖరు వరకు సెలవులుండగా.. జూన్ 2న తిరిగి కాలేజీలు ప్రారంభం అవుతాయి. మొత్తం 235 రోజులు తరగతులు జరగనున్నాయి. అలాగే వేసవి సెలవులు కాకుండా మొత్తం 79 హాలిడేస్ ఉంటాయని సమాచారం.