AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఆమె ఫోన్ చేసి క్యూట్‌గా మాట్లాడుతుంది.. ఆపై స్పైసీ వీడియో కాల్.. కట్ చేస్తే..

తీయని మాటలు - ఆపై అశ్లీల వీడియోకాల్... కక్కుర్తి పడ్డారో ఖేల్ ఖతం.. సత్యసాయి జిల్లాలో హనీట్రాప్ కేసును చేధించారు పోలీసులు. నలుగురు నిందితుల అరెస్టు చేశారు. హనీ ట్రాప్​లో మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఒక్కరే. కానీ తీగలాగితే డొంక కదులుతుంది.

Andhra News: ఆమె ఫోన్ చేసి క్యూట్‌గా మాట్లాడుతుంది.. ఆపై స్పైసీ వీడియో కాల్.. కట్ చేస్తే..
Women (Representative image)
Ram Naramaneni
|

Updated on: Mar 24, 2025 | 4:09 PM

Share

మహిళతో న్యూడ్ కాల్స్ చేయించి.. వాటిని రికార్డ్ చేసి, బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న గ్యాంగ్‌ను కటకటాల్లోకి పంపారు లేపాక్షి పోలీసులు. మొత్తం నలుగురు నిందితుల అరెస్టు చేశారు. లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన ధనుంజయ, రవికుమార్, రమేశ్​తో పాటు ఆ మహిళను అరెస్టు చేసి వారిని ఆదివారం రిమాండ్​కు​ తరలించారు.

శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కొండూరుకు చెందిన ధనుంజయ్ అనే యువకుడు ఈ కేసులో ప్రధాన నిందితుడని తేల్చారు. ధనుంజయ్ ట్రాప్‌లో చిక్కుకుని.. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి లక్షా యాభై వేలు నిందితులకు ఇచ్చాడు. సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన లేపాక్షి పోలీసులు.. ఎంక్వైరీ చేయగా డొంక కదిలింది. ధనుంజయ్ గ్యాంగ్ చాలామందిని మోసం చేసిందని గుర్తించారు. ఓ రెవిన్యూ సెక్రెటరీ నుంచి దాదాపు మూడు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తేల్చారు. నిందితుల నుంచి నాలుగు సెల్ ఫోన్లు.. 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మహిళ సహా నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు.  ఈ కేసులో మరింత మంది బాధితులు ఉన్నట్లు లేపాక్షి మండలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు