AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.? మరి ఎలాగంటే.!

మహిళల కోసం తెలంగాణ సర్కార్ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పధకాన్ని వినియోగించుకునేందుకు మహిళలు ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాల్సిందే. అయితే ఇకపై ఆ అవసరం లేదని తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Telangana: ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.? మరి ఎలాగంటే.!
Free Bus Journey
Ravi Kiran
|

Updated on: Dec 28, 2025 | 10:00 AM

Share

మహాలక్ష్మీ పధకం కింద మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంలో పలు కీలక మార్పులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందట. రవాణా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు.. అత్యాధునిక సాంకేతికతను జోడించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ‘స్మార్ట్ కార్డు’లను పంపిణీ చేయాలని ఆలోచిస్తోంది. తొలి దశలో వీటిని మహాలక్ష్మీ పధకంలో అమలు చేయనుంది. మహిళల కోసం ప్రత్యేకంగా కామన్ మొబిలిటీ కార్డులను జరీ చేయనుంది. ఈ కార్డులను రూపొందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

కామన్ మొబిలిటీ కార్డులు కేవలం బస్సు పాస్ మాత్రమే కాకుండా.. మల్టీ పర్పస్ డిజిటల్ వాలెట్ కింద ఉపయోగించేలా రూపకల్పన చేస్తున్నారు. ఈ కార్డు ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడమే కాకుండా.. ఇందులో మనీ లోడ్ చేసి మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలో కూడా ప్రయాణం చేయవచ్చు. భవిష్యత్తులో ఇదే కార్డుకు రేషన్, ఆరోగ్య సేవలు, ఇతర ప్రభుత్వ పధకాలను కూడా అనుసంధానం చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్డు ఉంటే.. ఇకపై ప్రయాణీకులు ఆధార్ కార్డును ప్రతీసారి తమ వెంట తీసుకెళ్ళాల్సిన పని ఉండదు. ఈ కార్డుల ద్వారా ప్రతీ ప్రయాణం ఇక డిజిటల్‌గా రికార్డు అవుతుంది కాబట్టి.. దానికి తగ్గట్టుగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. అలాగే ఈ డిజిటల్ కార్డుల ద్వారా రవాణా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని అనుకుంటోంది. కాగా, రాష్ట్ర ప్రజలందరికీ ఈ స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకొస్తే.. తెలంగాణ డిజిటల్ విప్లవానికి ఇదే నాంది కానుంది. అటు ఇప్పటివరకు మహాలక్ష్మీ పధకం కింద సుమారు సుమారు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరగగా.. ప్రభుత్వం రూ. 8,500 కోట్లను ఆర్టీసీకి ఇచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి..?
మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి..?
పెయింట్ పాడవకుండా క్రేయాన్స్, మార్కర్ మరకలు మాయం
పెయింట్ పాడవకుండా క్రేయాన్స్, మార్కర్ మరకలు మాయం
కాంగ్రెస్ హవా ..చిట్యాలలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి సెన్సేషన్
కాంగ్రెస్ హవా ..చిట్యాలలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి సెన్సేషన్
నాతో సౌందర్య స్పెషల్ సాంగ్.. ఆ సినిమా ఏకంగా 365 రోజులు ఆడింది..
నాతో సౌందర్య స్పెషల్ సాంగ్.. ఆ సినిమా ఏకంగా 365 రోజులు ఆడింది..
Mancherial Corporation: మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం
Mancherial Corporation: మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం
పండుగల స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే క్యారెట్ రసమలై..
పండుగల స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే క్యారెట్ రసమలై..
నల్గొండలో కాంగ్రెస్ ప్రభంజనం.. కార్పొరేషన్‌తో పాటు 6 మున్సిపాలిటీ
నల్గొండలో కాంగ్రెస్ ప్రభంజనం.. కార్పొరేషన్‌తో పాటు 6 మున్సిపాలిటీ
నిజామాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ హవా.. కార్పొరేషన్ మాత్రం..
నిజామాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ హవా.. కార్పొరేషన్ మాత్రం..
హాలీడే ప్లాన్ చేస్తున్నారా? ఈ బీచ్‌లలో వైరస్‌ ముప్పు! ఆరోగ్య శాఖ
హాలీడే ప్లాన్ చేస్తున్నారా? ఈ బీచ్‌లలో వైరస్‌ ముప్పు! ఆరోగ్య శాఖ
వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ జయకేతనం
వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ జయకేతనం